ఏపీలో నేటినుంచి పోలీస్ లకు వీక్లీఆఫ్..

ఏపీ పోలీస్ సిబ్బందికి సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఈరోజు నుంచి పోలీసు విభాగంలో పనిచేసే సిబ్బంది అందరికీ వీక్లీఆఫ్ లు అమలవుతాయని చెప్పారు. విజయవాడలో జరిగిన పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఆయన వీక్లీఆఫ్ లపై ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వీక్లీఆఫ్ లపై గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. అయితే కొవిడ్ కారణంగా పోలీసులకు పనిభారం ఎక్కువైంది, వీక్లీఆఫ్ ల విషయం పక్కనపడింది. మామూలు డ్యూటీలతోపాటు, అదనపు […]

Advertisement
Update:2021-10-21 05:28 IST

ఏపీ పోలీస్ సిబ్బందికి సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఈరోజు నుంచి పోలీసు విభాగంలో పనిచేసే సిబ్బంది అందరికీ వీక్లీఆఫ్ లు అమలవుతాయని చెప్పారు. విజయవాడలో జరిగిన పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఆయన వీక్లీఆఫ్ లపై ప్రకటన చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ వీక్లీఆఫ్ లపై గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. అయితే కొవిడ్ కారణంగా పోలీసులకు పనిభారం ఎక్కువైంది, వీక్లీఆఫ్ ల విషయం పక్కనపడింది. మామూలు డ్యూటీలతోపాటు, అదనపు డ్యూటీలు కూడా చేసిన పోలీసులు కొవిడ్ వారియర్లుగా అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఏపీలో కొవిడ్ పరిస్థితి అదుపులోకి వచ్చిందని, అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వీక్లీ ఆఫ్ లను అమలులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు సీఎం జగన్.

భారీగా నియామకాలు..
ఏపీ పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడతామన్నారు జగన్. కొవిడ్‌ కారణంగా చనిపోయిన పోలీసుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం ఇచ్చామని, కరోనా బారిన పడిన పోలీసులకు ప్రత్యేక వైద్య సేవలు అందించామని చెప్పారు. గత ప్రభుత్వం పోలీస్ శాఖకు బకాయి పెట్టిన 1500 కోట్ల రూపాయలను తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేశామని గుర్తు చేశారు జగన్.

అధికారం దక్కలేదన్న అక్కసుతో..
అధికారం దక్కలేదన్న అక్కసుతో ఏపీలో ప్రతిపక్షం కులాల మధ్య చిచ్చుపెడుతోందని మండిపడ్డారు సీఎం జగన్. చీకట్లో విగ్రహాలను ధ్వంసం చేశారని, రథాలను తగలబెట్టారని, ప్రభుత్వ పథకాలకు అడ్డుపడుతున్నారని, ఇంగ్లిష్ మీడియం అమలుని అడ్డుకున్నారని, చివరకు ముఖ్యమంత్రిని కూడా బూతులు తిడుతున్నారని అన్నారు. సీఎంని అభిమానించేవారు తిరగబడాలనే ఉద్దేశంతోనే వారు ఇదంతా చేశారని చెప్పారు. ఓ పథకం ప్రకారం.. అక్కసుతో రాష్ట్రం పరువు తీస్తున్నారని విమర్శించారు జగన్. డ్రగ్స్‌తో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ డీజీపీ, డీఆర్‌ఐ చెప్పినా కూడా అసత్య ప్రచారం ఆగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పు చేస్తే ఎవర్ని వదలొద్దు
రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, పోలీసులు ఎక్కడా రాజీ పడొద్దని ఆదేశించారు సీఎం జగన్. తప్పు చేసినవారెవర్నీ వదిలిపెట్టకుండా చట్టం ముందు నిలబెట్టాలన్నారు. మహిళలు, చిన్నపిల్లలు, బడుగు, బలహీన వర్గాల విషయంలో రాజీ పడొద్దని చెప్పారు. రాజకీయ నేతల్లో అసాంఘిక శక్తులను ఏరిపారేయాలని సూచించారు.

Tags:    
Advertisement

Similar News