జనసేన గందరగోళ నిర్ణయం

బద్వేలులో బీజేపీకి మద్దతు ఇస్తామంటూ ప్రకటన జనసేన బలపడకపోవడానికి కారణం.. ఆ పార్టీ తీసుకొనే గందరగోళ నిర్ణయాలు అని చెప్పక తప్పదేమో. తొలుత బీజేపీ, టీడీపీ దోస్తి కట్టిన జనసేనాని.. ఆ తర్వాత కమ్యూనిస్టులు, బీఎస్పీ వంటి ప్రగతి శీల పార్టీలతో జత కట్టారు. చివరకు మళ్లీ బీజేపీ పంచన చేరారు. పవన్​ కల్యాణ్​ నిర్ణయాలు అప్పుడప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. బద్వేలు ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ విడుదల చేసిన విషయం తెలిసిందే. బద్వేలు […]

Advertisement
Update:2021-10-09 11:43 IST
  • బద్వేలులో బీజేపీకి మద్దతు ఇస్తామంటూ ప్రకటన

జనసేన బలపడకపోవడానికి కారణం.. ఆ పార్టీ తీసుకొనే గందరగోళ నిర్ణయాలు అని చెప్పక తప్పదేమో. తొలుత బీజేపీ, టీడీపీ దోస్తి కట్టిన జనసేనాని.. ఆ తర్వాత కమ్యూనిస్టులు, బీఎస్పీ వంటి ప్రగతి శీల పార్టీలతో జత కట్టారు. చివరకు మళ్లీ బీజేపీ పంచన చేరారు. పవన్​ కల్యాణ్​ నిర్ణయాలు అప్పుడప్పుడూ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. బద్వేలు ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్​ విడుదల చేసిన విషయం తెలిసిందే. బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.

వెంకట సుబ్బయ్య భార్య సుధకు వైసీపీ టికెట్​ ఇచ్చింది. దీంతో మరణించిన అభ్యర్థి కుటుంబసభ్యులకు టికెట్​ ఇచ్చారు కాబట్టి.. గత సంప్రదాయాలను పాటించి తాము పోటీకి దూరంగా ఉంటున్నామని పవన్​ కల్యాణ్​ ప్రకటించారు. టీడీపీ కూడా దాదాపు ఇదే రకమైన అభిప్రాయంతో పోటీ నుంచి తప్పుకున్నది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్​ లో అసలు ఉనికిలో ఉన్నాయో లేవో కూడా తెలియని కాంగ్రెస్​, బీజేపీ పార్టీలు మాత్రం.. ఇక్కడ తాము పోటీచేయబోతున్నట్టు ప్రకటించాయి.

బీజేపీకి జనసేన మిత్రపక్షం..మరి జనసేన బరిలో లేదు కాబట్టి సైలెంట్​ గా ఉంటుందా? లేక బీజేపీకి మద్దతు ఇస్తుందా? అన్న విషయంపై ఉత్కంఠ నెలకొన్నది. చివరకు జనసేన పార్టీ ముఖ్యనేత నాదెండ్ల మనోహర్ ఓ ప్రకటన చేశారు. తాము బీజేపీకి మద్దతు ఇవ్వబోతున్నట్టు ఆయన ప్రకటించారు.

ఇదిలా ఉంటే జనసేన తీరుపై విమర్శలు వస్తున్నాయి. సంప్రదాయాన్ని గౌరవించి పోటీ నుంచి తప్పకుంటామన్న మీరు.. ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి ఎలా మద్దతు ఇస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. జనసేన మద్దతుతో ఈ ఎన్నికల్లో బీజేపీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. టీడీపీ, జనసేన పోటీలో లేవు కాబట్టి.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమకే పడతాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. వాళ్ల అంచనాలు నిజమవుతాయా? లేక తలకిందులవుతాయా? అన్నది వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News