రైతులపైకి దూసుకెళ్లిన బీజేపీ ఎంపీ కారు.. ఈసారి హర్యానాలో..!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖీమ్ పూర్ ఖేరీ లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడు కారు పోనివ్వడంతో నలుగురు రైతులు సహా మొత్తం తొమ్మిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రైతుల మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలంటూ ప్రతిపక్షాలు భారీ స్థాయిలో ఆందోళనలు నిర్వహించాయి. కాగా లఖీమ్ పూర్ లో జరిగినట్లుగానే ఇవాళ హర్యానా రాష్ట్రంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న […]

Advertisement
Update:2021-10-07 16:20 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖీమ్ పూర్ ఖేరీ లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడు కారు పోనివ్వడంతో నలుగురు రైతులు సహా మొత్తం తొమ్మిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రైతుల మృతికి కారణమైన వారిని అరెస్టు చేయాలంటూ ప్రతిపక్షాలు భారీ స్థాయిలో ఆందోళనలు నిర్వహించాయి.

కాగా లఖీమ్ పూర్ లో జరిగినట్లుగానే ఇవాళ హర్యానా రాష్ట్రంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి బీజేపీ ఎంపీ కారు పోనివ్వడంతో ఓ రైతు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నయాబ్ సైనీ హర్యానా మైనింగ్ మంత్రి మూల్ చంద్ శర్మ తో సహా ఇతర పార్టీ నాయకులు గురువారం నారిన్గడ్లోని సైనీ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా బీజేపీ నేతల పర్యటనను నిరసిస్తూ స్థానిక రైతులు ఆ భవనం బయట పెద్ద సంఖ్యలో గుమిగూడారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఆ సమయంలో బయటకు వచ్చిన బీజేపీ ఎంపీ నయాబ్ సైనీ కారు నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక రైతుకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరో రైతు కారు మీదకు రావడం చూసి పక్కకు దూకి ప్రమాదం నుంచి బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ రైతును స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఎంపీ తీరుపై హర్యానాలో విమర్శలు చెలరేగుతున్నాయి.

Tags:    
Advertisement

Similar News