లేబుల్స్ చదివి కొంటున్నారా?

గ్రాసరీ స్టోర్‌‌కి వెళ్లి ఫుడ్ ప్యాకెట్స్ కొనేముందు వెనుక ఉండే లేబుల్స్ చదవాలని చాలామందికి తెలీదు. అయితే విడప్పుడు చదవకపోయినా ఇప్పుడు మాత్రం లేబుల్స్ చదవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ టైంలో సరైన ఫుడ్ ఎంచుకోవడం, ఫుడ్ హైజీన్‌గా ఉండడం చాలా ముఖ్యం. ఆరోగ్యం కాపాడుకోవాలనుకుంటే కొనబోయే ప్రతి ఫుడ్‌లేబుల్‌చదివి ఫుడ్‌ను ఎంచుకోవాలి. లేబుల్స్‌మీద ఫుడ్ క్వాంటిటి, క్యాలరీల వివరాలుంటాయి. అందులో ఉన్న పదార్థాల క్వాంటిటీని బట్టి వివరాలు ఒక ఆర్డర్‌‌లో రాసి ఉంటాయి. అందులో […]

Advertisement
Update:2021-09-26 11:30 IST

గ్రాసరీ స్టోర్‌‌కి వెళ్లి ఫుడ్ ప్యాకెట్స్ కొనేముందు వెనుక ఉండే లేబుల్స్ చదవాలని చాలామందికి తెలీదు. అయితే విడప్పుడు చదవకపోయినా ఇప్పుడు మాత్రం లేబుల్స్ చదవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ టైంలో సరైన ఫుడ్ ఎంచుకోవడం, ఫుడ్ హైజీన్‌గా ఉండడం చాలా ముఖ్యం. ఆరోగ్యం కాపాడుకోవాలనుకుంటే కొనబోయే ప్రతి ఫుడ్‌లేబుల్‌చదివి ఫుడ్‌ను ఎంచుకోవాలి.

లేబుల్స్‌మీద ఫుడ్ క్వాంటిటి, క్యాలరీల వివరాలుంటాయి. అందులో ఉన్న పదార్థాల క్వాంటిటీని బట్టి వివరాలు ఒక ఆర్డర్‌‌లో రాసి ఉంటాయి. అందులో వాడిన ఫ్లేవర్స్, స్టెబిలైజర్స్‌, ఇతర కెమికల్స్ వివరాలు కూడా ఉంటాయి. అందుకే అవన్నీ చదివిన తర్వాతే ఫుడ్ కొనుక్కోవాలని ఎఫ్‌డిఎ(ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్) సూచిస్తోంది. ఫుడ్ ప్రొడక్ట్ కొనేముందు లేబుల్స్‌లో ఉండే కొన్ని పదాలకు అర్థాలు తెలుసుకోవాలి.

క్యాలరీలు: ఫుడ్ ప్రొడక్ట్‌ను ఎంచుకునేటప్పుడు క్యాలరీలు కచ్చితంగా చెక్ చేసుకోవాలి. క్యాలరీలు తక్కువగా, షుగర్స్ ఎక్కువగా ఉంటే అది జంక్ ఫుడ్ కింద లెక్క. అందుకే క్యాలరీలు సరిగ్గా ఉండాలంటే రుచికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. క్యాలరీలున్న ఆహారాలన్నీ రుచిగా ఉండకపోవచ్చు. అందుకే రుచిని పక్కన పెట్టి క్యాలరీలు సరిపడా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

ఫైబర్: రోజువారి ఆహారంలో ఫైబర్ చాలా ముఖ్యమైంది. అయితే మనం రోజూ తినే కాయగూరలు, ఫ్రూట్స్, పప్పు ధాన్యాల్లో సరిపడా ఫైబర్‌ఉంటుంది. ఒకవేళ ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఎంచుకుంటే.. అందులో రోజుకి 30 నుంచి 40 గ్రాముల ఫైబర్ కంటెంట్ ఉండేలా చూసుకోవాలి.

ఫ్యాట్స్: ఫ్యాట్ ఫుడ్స్‌లో కొన్ని మంచి ఫ్యాట్స్ కూడా ఉంటాయి. నెయ్యి, వెన్న లాంటి పదార్థాల్లో మంచి కొవ్వు ఉంటుంది. అయితే అలాంటి ప్యాకెట్స్ కొనేటప్పుడు వాటి లేబుల్స్‌పై ‘ట్రాన్స్ ఫ్యాట్స్’, ‘హైడ్రోజినేటెడ్’ అనే పదాలు ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. అలా ఉంటే అవి మంచి ఫ్యాట్స్ కాదని అర్థం.

ఎన్‌రిచ్డ్‌: చాలా ఫుడ్ ప్రొడక్ట్స్ లేబుల్‌పై ఎన్‌రిచ్డ్‌అని రాసి ఉంటుంది. ఎన్‌రిచ్డ్ అంటే ఆ పదార్థంలోని పోషకాల్లో కొన్ని మార్పులు చేశారని అర్థం. పదార్థాలను నిల్వ చేయడం కోసం ఇలా చేస్తుంటారు. అందుకే వీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే పదార్థాన్ని బట్టి, అందులోని క్యాలరీలను బట్టి అది మంచిదో కాదో నిర్ణయించుకోవాలి.

లో కొలెస్ట్రాల్‌: ప్రొడక్ట్‌లేబుల్ మీద ‘లో కొలెస్ట్రాల్’ అని ఉంటే.. అందులో పూర్తిగా కొలెస్ట్రాల్ లేదని కాదు. 20 మిల్లీగ్రాముల కంటే తక్కువ కొలెస్ట్రాల్‌ఉందని అర్థం. అలాగే ‘ఫ్యాట్‌ఫ్రీ’ అని రాసి ఉంటే అందులో కొవ్వు 13 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉందని అర్థం.

ఆర్గానిక్‌: ‘ఆర్గానిక్’ అన్న పదం లేబుల్‌మీద కనిపిస్తే అందులో 70 శాతం కంటెంట్ ఆర్గానిక్‌అని అర్థం. ఒక వేళ అందులో వాడిన పదార్థాలన్నీ ఆర్గానిక్ అయితే దానిమీద 100% ఆర్గానిక్‌అని ఉంటుంది.

ఫ్రీ: లేబుల్ మీద ‘షుగర్ ఫ్రీ’ అని ఉంటే అందులో 0.05 గ్రాముల వరకు చక్కెర ఉండొచ్చు. అందులో ఆర్టిఫీషియల్‌స్వీటెనర్లు కూడా ఉండొచ్చు. అందుకే అలాంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. అలాగే ‘ఫ్యాట్‌ఫ్రీ’ అని ఉంటే అందులో ఫ్యాట్‌లేదని కాదు. 0.05% ఫ్యాట్‌ఉండొచ్చు.

Tags:    
Advertisement

Similar News