యూపీ: కాంగ్రెస్ కొత్త స్కెచ్.. సీఎం అభ్యర్థిగా ప్రియాంక
దేశవ్యాప్తంగా బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతోంది. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ .. గత కొన్నేళ్లుగా బలహీనపడిన విషయం తెలిసిందే. ఓ వైపు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేక గాలులు వీస్తున్నప్పటికీ దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతూ వస్తున్నది. దీంతో ప్రాంతీయ పార్టీలు దూసుకుపోతున్నాయి. ఇదిలా ఉంటే యూపీలో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ ఎంతో కాలంగా ప్రయత్నిస్తోంది. గాంధీ కుటుంబానికి సొంత రాష్ట్రం అయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ బలపడలేక పోతున్నది. […]
దేశవ్యాప్తంగా బలపడేందుకు కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతోంది. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ .. గత కొన్నేళ్లుగా బలహీనపడిన విషయం తెలిసిందే. ఓ వైపు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేక గాలులు వీస్తున్నప్పటికీ దాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడంలో కాంగ్రెస్ విఫలమవుతూ వస్తున్నది. దీంతో ప్రాంతీయ పార్టీలు దూసుకుపోతున్నాయి.
ఇదిలా ఉంటే యూపీలో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ ఎంతో కాలంగా ప్రయత్నిస్తోంది. గాంధీ కుటుంబానికి సొంత రాష్ట్రం అయినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ బలపడలేక పోతున్నది. ప్రస్తుతం యూపీలో బీజేపీ అధికారంలో ఉంది. ఇక సమాజ్వాద్ పార్టీ.. బహుజన్ సమాజ్వాద్ పార్టీ కూడా బలంగానే ఉన్నాయి. కాంగ్రెస్ ఇక్కడ నాలుగో స్థానంలో ఉంది. కాంగ్రెస్కు మద్దతుగా నిలబడే.. ముస్లింలు, దళితులు దూరం కావడంతో ఇక్కడ కాంగ్రెస్ డీలా పడింది.
ఇక బీజేపీ హిందూత్వ ఓట్లతో బలం పుంజుకున్నది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం ప్రియాంకా గాంధీని.. యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.ఇందుకు తగ్గట్టుగానే చాలా రోజులుగా ప్రియాంకా గాంధీ.. యూపీపై ఫోకస్ పెట్టారు. త్వరలో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేయబోతున్నట్టు సమాచారం. మరి కాంగ్రెస్ పార్టీ వేసిన ఈ ఎత్తుగడ ఏమైనా ఫలితాలు ఇస్తుందేమో వేచి చూడాలి.