సచివాలయ ఉద్యోగులకు శుభవార్త..

గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేసింది. అప్పటికప్పుడు అందరికీ నెలజీతం 15వేల రూపాయలు ఫిక్స్ చేసి సచివాలయాల్లో ఉద్యోగాలిచ్చారు. అయితే రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి కావస్తుండటంతో.. సచివాలయాల ఉద్యోగులు తమను పర్మినెంట్ చేయాలని కోరుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వారికి డిపార్ట్ మెంటల్ టెస్ట్ లు పెట్టడానికి సిద్ధమైంది. ఈనెల 13నుంచి 17 […]

Advertisement
Update:2021-09-11 03:00 IST

గ్రామ, వార్డు సచివాలయాల పేరుతో ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేసింది. అప్పటికప్పుడు అందరికీ నెలజీతం 15వేల రూపాయలు ఫిక్స్ చేసి సచివాలయాల్లో ఉద్యోగాలిచ్చారు. అయితే రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి కావస్తుండటంతో.. సచివాలయాల ఉద్యోగులు తమను పర్మినెంట్ చేయాలని కోరుతూ వస్తున్నారు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. వారికి డిపార్ట్ మెంటల్ టెస్ట్ లు పెట్టడానికి సిద్ధమైంది. ఈనెల 13నుంచి 17 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకుంటారు. ఇదే నెల 28నుంచి 30వ తేదీ వరకు 3 రోజులపాటు పరీక్షలు నిర్వహిస్తారు. ఏపీపీఎస్సీ ఈ పరీక్షలకోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఏపీలో సచివాలయాల పేరుతో నూతన వ్యవస్థను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు ఏర్పాటు చేసి, 1.34 ల‌క్షల మందికి ఉద్యోగాలిచ్చింది. ప్రస్తుతం వారంతా ప్రత్యేక విభాగం కింద ఉద్యోగులుగా ఉన్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పే స్కేల్ ఇచ్చి పర్మినెంట్ చేయాలని చాలా కాలంగా వారు కోరుతున్నారు. రెండేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయ్యే సమయంలో ప్రభుత్వం వారికి డిపార్ట్ మెంటల్ పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షల్లో 100 మార్కులకు గాను 40 మార్కులు సాధించినవారందరికీ ప్రొబేషన్ డిక్లేర్ చేస్తారు.

ప్రభుత్వ నిర్ణయంతో లక్షా 34వేలమంది సచివాలయాల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరంతా పర్మినెంట్ అయ్యే క్రమంలో జీతాలు పెంచడం, ఇతర సదుపాయాల కల్పన ప్రభుత్వంపై అదనపు భారంగా మారుతుంది. అదే సమయంలో పీఆర్సీకోసం వేచి చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ సంగతేంటని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యలన్నీ చుట్టుముడతాయని తెలిసే సీఎం జగన్ ధైర్యంగా ముందడుగేశారు. ముందుగా సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త చెప్పారు.

Tags:    
Advertisement

Similar News