కౌశిక్​కు ఎమ్మెల్సీ లేనట్టేనా? గవర్నర్​ తమిళ సై అనూహ్య నిర్ణయం..!

సహజంగా మంత్రివర్గం గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీ జాబితాను పంపిస్తే వెంటనే ఆమోదం లభిస్తుంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసిన అనేకమందికి గవర్నర్​ కోటా కింద ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. క్యాబినెట్​ నిర్ణయమే దాదాపుగా ఫైనల్​. ఇటీవల తెలంగాణ సర్కారు పాడి కౌశిక్​రెడ్డిని గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని భావించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదించి గవర్నర్​కు ప్రతిపాదన పంపింది. అయితే అనూహ్యంగా గవర్నర్​ ఈ నియామకాన్ని పెండింగ్​లో పెడుతూ వచ్చారు. ఈ విషయంపై […]

Advertisement
Update:2021-09-08 17:47 IST

సహజంగా మంత్రివర్గం గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీ జాబితాను పంపిస్తే వెంటనే ఆమోదం లభిస్తుంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసిన అనేకమందికి గవర్నర్​ కోటా కింద ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. క్యాబినెట్​ నిర్ణయమే దాదాపుగా ఫైనల్​. ఇటీవల తెలంగాణ సర్కారు పాడి కౌశిక్​రెడ్డిని గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీగా నియమించాలని భావించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మంత్రివర్గం ఆమోదించి గవర్నర్​కు ప్రతిపాదన పంపింది. అయితే అనూహ్యంగా గవర్నర్​ ఈ నియామకాన్ని పెండింగ్​లో పెడుతూ వచ్చారు.

ఈ విషయంపై ఇంతకాలం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ.. అటు గవర్నర్​ కార్యాలయం నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే తాజాగా గవర్నర్​ తమిళసై సౌందర్​ రాజన్​ ఈ విషయంపై స్పందించారు. ‘పాడి కౌశిక్​రెడ్డి సేవా కార్యక్రమాలు చేశారన్న కారణంతో ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్​ చేశారు. ఈ విషయంపై ఇంకా అధ్యయనం సాగాల్సి ఉంది’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. దీంతో అంతా షాక్​ అయ్యారు.

అయితే గవర్నర్​ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వ పెద్దలు గానీ.. టీఆర్​ఎస్​ నేతలు గానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ విషయం ఎంత దూరం వెళుతుందో వేచి చూడాలి.పాడి కౌశిక్​రెడ్డి గతంలో కాంగ్రెస్​ పార్టీలో ఉన్నారు. ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్​ నియోజవర్గంలో కాంగ్రెస్​ తరఫున పోటీచేశారు. అప్పట్లో ఈ స్థానం నుంచి ఈటల గెలుపొందారు.

ఇదిలా ఉంటే ఇటీవల ఈటల రాజేందర్​ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కౌశిక్​రెడ్డి టీఆర్​ఎస్​లో చేరారు. అయితే ఆయన హుజూరాబాద్​ నుంచి టీఆర్​ఎస్​ అభ్యర్థిగా పోటీచేస్తారని అంతా భావించారు. కానీ కేసీఆర్​ మాత్రం అక్కడ వ్యూహాత్మకంగా గెల్లు శ్రీనివాస్​ను బరిలోకి దించారు.ఇక కౌశిక్​రెడ్డికి ఆయన ఎమ్మెల్సీ పదవి ఇస్తానని మాట ఇచ్చారు. అన్నట్టుగానే మంత్రి వర్గం కూడా ఆమోదించింది. కానీ ఈ నిర్ణయం పై గవర్నర్​ అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News