నాడు-నేడుపై నిర్లక్ష్యం వద్దు.. మళ్లీ పూర్వ స్థితికి వెళ్లొద్దు..

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం పేరుతో తొలి విడత 3600 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని, నిర్లక్ష్యం వహిస్తే.. మళ్లీ పూర్వ స్థితికి వెళ్లినట్టవుతుందని అధికారులను హెచ్చరించారు సీఎం జగన్. నూతన గదులు, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. భవనాల మరమ్మతులకు ప్రతి పాఠశాలలో కంటింజెన్సీ ఫండ్‌ ఉండాలని, అప్పుడే పాఠశాలలు నిత్య నూతనంగా ఉంటాయని, దానికోసం నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలని సూచించారు. రెండో విడత, మూడో విడత నాడు-నేడు పనులపై […]

Advertisement
Update:2021-09-08 03:10 IST
నాడు-నేడుపై నిర్లక్ష్యం వద్దు.. మళ్లీ పూర్వ స్థితికి వెళ్లొద్దు..
  • whatsapp icon

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం పేరుతో తొలి విడత 3600 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశామని, నిర్లక్ష్యం వహిస్తే.. మళ్లీ పూర్వ స్థితికి వెళ్లినట్టవుతుందని అధికారులను హెచ్చరించారు సీఎం జగన్. నూతన గదులు, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. భవనాల మరమ్మతులకు ప్రతి పాఠశాలలో కంటింజెన్సీ ఫండ్‌ ఉండాలని, అప్పుడే పాఠశాలలు నిత్య నూతనంగా ఉంటాయని, దానికోసం నిర్దిష్ట విధానాన్ని రూపొందించాలని సూచించారు. రెండో విడత, మూడో విడత నాడు-నేడు పనులపై దృష్టి సారించాలన్నారు జగన్.

అన్ని స్కూళ్లలో సీబీఎస్ఈ..
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశ పెట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ముందుగా వెయ్యి స్కూళ్లతో మొదలు పెడతామని అధికారులు సమాధానమివ్వగా, అన్ని స్కూళ్లలో ఒకేసారి ప్రవేశ పెట్టాలన్నారు జగన్. ఐసీఎస్ఈ సిలబస్ పైనా దృష్టి పెట్టాలని సూచించారు. పాఠ్యపుస్తకాల ముద్రణలో నాణ్యత పెంచాలన్నారు.

విద్యాకానుక మరింత ఘనంగా..
ప్రస్తుతం స్కూల్ పిల్లలకు ఇచ్చే జగనన్న విద్యా కానుకకు అదనంగా స్పోర్ట్స్ డ్రస్ జతకాబోతోంది. స్పోర్ట్స్ డ్రస్, స్పోర్ట్స్ షూ కూడా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఇస్తారు. వచ్చే ఏడాది నుంచి దీన్ని పగడ్బందీగా అమలు చేయాలని చెప్పారు జగన్. కొత్త విద్యా సంవత్సరం మొదలయ్యే లోపే విద్యా కానుక సిద్ధం చేసి ఉంచాలన్నారు. అందులో భాగంగా ఇచ్చే వస్తువుల నాణ్యతపై ఎక్కడా రాజీ పడొద్దని సూచించారు. స్వేచ్ఛ పేరుతో ఆడపిల్లలకు శానిటరీ నాప్కిన్లు ఇచ్చే కార్యక్రమాన్ని అక్టోబరులో ప్రారంభించబోతున్నారు.

మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు..
ఇప్పటి వరకూ ఎలిమెంటరీ స్కూల్స్ లో ఒకటినుంచి ఐదవ తరగతి వరకు సబ్జెక్ట్ టీచర్లు ఉండరు. ఒక టీచరే అన్ని సబ్జెక్ట్ లు బోధిస్తుంటారు. ఒకే టీచర్ ఐదు తరగతులకు అన్ని సబ్జెక్ట్ లు బోధించే ఏకోపాధ్యాయ పాఠశాలలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. అయితే ఇకపై మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ ల వారీగా టీచర్లను ఉంచాలని అధికారులకు సూచించారు సీఎం జగన్. ప్రపంచ స్థాయిలో పోటీకి తగినట్టుగా విద్యార్థులను తయారు చేసేందుకు ఉద్దేశించిన నూతన విద్యా విధానం అమలుపై అన్ని రకాలుగా సిద్ధం కావాలని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News