ఖిలాడీ రిలీజ్ డేట్ లాక్
చకచకా సినిమాలు చేసే రవితేజ, మరో సినిమాను కొలిక్కి తీసుకొచ్చాడు. అదే ఖిలాడీ సినిమా. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ కొలిక్కి వచ్చింది. ఇదే ఊపులో సినిమా విడుదల తేదీని కూడా లాక్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే దీపావళి బరిలో ఖిలాడీ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు మేకర్స్. చాన్నాళ్ల తర్వాత రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ఖిలాడీ. మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ […]
చకచకా సినిమాలు చేసే రవితేజ, మరో సినిమాను కొలిక్కి తీసుకొచ్చాడు. అదే ఖిలాడీ సినిమా. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఆల్ మోస్ట్ కొలిక్కి వచ్చింది. ఇదే ఊపులో సినిమా విడుదల తేదీని కూడా లాక్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే దీపావళి బరిలో ఖిలాడీ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు మేకర్స్.
చాన్నాళ్ల తర్వాత రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ఖిలాడీ. మూవీకి సంబంధించి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే నాన్-థియేట్రికల్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ కు అమ్మేసిన మేకర్స్.. మరో నెల రోజుల్లో థియేట్రికల్ బిజినెస్ ను కూడా క్లోజ్ చేయబోతున్నారు.
నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఆ మేరకు విడుదల తేదీ కూడా ప్రకటించారు. కానీ కరోనా సెకెండ్ వేవ్ వల్ల సాధ్యం కాలేదు. అలా వాయిదాపడిన ఈ సినిమాను దీపావళి బరిలో దించబోతున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.