తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెల్లడి.. 30 నుంచి తొలి విడత కౌన్సిలింగ్

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు బుధవారం వెల్లడించారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు. అగస్టు 4 నుంచి 6 వరకు ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. కేవలం 15 రోజుల్లోనే ఎంసెట్ ఫలితాలను విడుదల చేయడం గమనార్హం. ఇంజనీరింగ్‌లో 82.08 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి సబిత స్పష్టం చేశారు. కరోనా […]

Advertisement
Update:2021-08-25 09:35 IST

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు బుధవారం వెల్లడించారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలు విడుదల చేశారు. అగస్టు 4 నుంచి 6 వరకు ఇంజనీరింగ్, 9, 10 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు సంబంధించిన ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. కేవలం 15 రోజుల్లోనే ఎంసెట్ ఫలితాలను విడుదల చేయడం గమనార్హం.

ఇంజనీరింగ్‌లో 82.08 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి సబిత స్పష్టం చేశారు. కరోనా కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎంసెట్ పరీక్షలను 9 విడతల్లో నిర్వహించినట్లు మంత్రిచెప్పారు. ఈ సారి ఎంసెట్ పరీక్షల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని.. గతంలో కంటే 28 వేల మంది విద్యార్థులు అదనంగా హాజరయ్యారని చెప్పారు.

ఇంజినీరింగ్‌‌లో మొదటి ర్యాంక్‌ పశ్చిమ గోదావరికి చెందిన కార్తికేయ సాధించాడు. రెండో ర్యాంక్ కడప జిల్లా రాజంపేటకు చెందిన వెంకట నరేష్‌, మూడో ర్యాంక్‌ హైదరాబాద్‌కి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌, నాలుగో ర్యాంక్‌ నల్గొండకు చెందిన రామస్వామి, ఐదో ర్యాంక్‌ కూకట్ పల్లికి చెందిన వెంకట ఆదిత్య సాధించారు. అగ్రికల్చర్‌ అండ్ మెడికల్‌ విభాగంలో మొదటి ర్యాంకును హైదరాబాద్‌కి చెందిన మండవ కార్తికేయ పొందగా, రెండో ర్యాంకును రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమాని శ్రీనీజ, మూడో ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన కౌశల్‌ రెడ్డి పొందారు.

ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ఈ నెల 30 నుంచి తొలి విడత కౌన్సిలింగ్ ప్రారంభమవుతుందని అధికారులు చెప్పారు. ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి సర్టిఫికేట్ల పరిశీలనకు స్లాట్లు బుక్ చేసుకోవాలని అధికారులు చెప్పారు. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు దృవపత్రాల పరిశీలన.. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. సెప్టెంబర్ 15న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 15 నుంచి 20 వరకు విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని అధికారులు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News