ఇండియాను వదిలి వెళ్లి.. తాలిబన్లలో చేరాడు
ఇప్పుడు ప్రపంచమంతా తాలిబన్ల గురించే చర్చించుకుంటున్నది. రెండు దశాబ్దాల క్రితం అఫ్గానిస్తాన్ వచ్చిన అమెరికా సైన్యం.. తాలిబన్లను అంతం చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ దాదాపు 20 ఏళ్ల పాటు అఫ్గానిస్తాన్‌లో ఉన్నా.. తాలిబన్లను పూర్తిగా నిరోధించలేకపోయారు. ఇక అమెరికాలో అధికార మార్పిడితో.. కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అఫ్గాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నది. వచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం చేజార్చుకోకుండా తాలిబన్లు ఒక్కో పట్టణాన్ని, ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ.. చివరకు […]
ఇప్పుడు ప్రపంచమంతా తాలిబన్ల గురించే చర్చించుకుంటున్నది. రెండు దశాబ్దాల క్రితం అఫ్గానిస్తాన్ వచ్చిన అమెరికా సైన్యం.. తాలిబన్లను అంతం చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ దాదాపు 20 ఏళ్ల పాటు అఫ్గానిస్తాన్‌లో ఉన్నా.. తాలిబన్లను పూర్తిగా నిరోధించలేకపోయారు. ఇక అమెరికాలో అధికార మార్పిడితో.. కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అఫ్గాన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నది. వచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం చేజార్చుకోకుండా తాలిబన్లు ఒక్కో పట్టణాన్ని, ప్రాంతాన్ని ఆక్రమించుకుంటూ.. చివరకు కాబూల్‌ను తమ వశం చేసుకున్నది.
గతంలో అనేక మంది అఫ్గాన్ దేశస్తులు తమ దేశం వదిలి ఇతర దేశాలకు వెళ్లిపోయారు. అమెరికా సైన్యానికి భయపడి పారిపోయిన వీళ్లంతా.. ఇప్పుడు తాలిబన్ల రాజ్యం రావడంతో తిరిగి సొంత దేశానికి వెళ్తున్నారు. గతంలో అఫ్గాన్ నుంచి పారిపోయి వచ్చిన మహ్మద్ అలాయాజ్ అబ్దుల్ హక్ అనే వ్యక్తి నాగ్‌పూర్ ప్రాంతంలో నివసించే వాడు. అయితే ఇటీవలే అతడు నాగ్‌పూర్ నుంచి వెళ్లిపోయాడు. 30 ఏళ్ల మహ్మద్ సొంత దేశానికి వెళ్లి తాలిబన్లలో చేరినట్లు సమాచారం అందింది. అతడు తుపాకీ పట్టుకొని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అఫ్గానిస్తాన్ నుంచి వచ్చిన అబ్దుల్ హక్ దాదాపు 10 ఏళ్ల పాటు నాగ్‌పూర్‌లోని దిఘోరి ప్రాంతంలో నివసిస్తున్నాడు. అతడు అక్రమంగా వలస వచ్చి జీవిస్తుండటంతో పోలీసులు నిఘా పెట్టారు. కానీ జూన్ మూడో వారం నుంచి అబ్దుల్ హక్ కనిపించకుండా పోయాడు. అప్పట్లో కేవలం 6 నెలల టూరిస్ట్ వీసా మీద వచ్చి ఏకంగా 10 ఏళ్ల పాటు ఇండియాలో నివసించినట్లు నాగ్‌పూర్ పోలీసులు చెబుతున్నారు. వీసా గడవు ముగిసిన తర్వాత తనను శరణార్దిగా గుర్తించాలని యూఎన్‌హెచ్ఆర్సీకి నివేదించుకున్నాడు. కానీ అతడి దరఖాస్తు తిరస్కరణకు గురైంది. అయినా సరే అతడు దేశాన్ని వదిలి వెళ్లకుండా ఇండియాలోనే అక్రమంగా నివసిస్తున్నాడు.
అబ్దుల్ హక్ తాలిబన్లతో కలసి పోయినట్లు ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నాగ్‌పూర్‌లో అతడికి తెలిసిన వాళ్లు గుర్తు పట్టి పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని నాగ్‌పూర్ పోలీసులు ధృవీకరించారు.