ఆరోగ్యశ్రీ కార్డులో కుటుంబ హెల్త్ రికార్డ్..

ఇకపై ఆరోగ్యశ్రీ కార్డులోనే కుటుంబ హెల్త్ రికార్డ్ భద్రపరుచుకోవచ్చు. ఏపీలో ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్యశ్రీ కార్డుకి క్యూఆర్ కోడ్ జత చేసి, దానిలో కుటుంబ సభ్యులందరి హెల్త్ రికార్డులు ఉండేలా చూస్తోంది. ఈమేరకు సీఎం జగన్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. రాబోయే రోజుల్లో కుటుంబం మొత్తానికి కాకుండా, వ్యక్తిగతంగా ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలని చెప్పారు. విలేజ్ క్లినిక్స్, వార్డ్ క్లినిక్స్ బలోపేతం.. ఇప్పటికే గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా.. […]

Advertisement
Update:2021-08-11 14:15 IST

ఇకపై ఆరోగ్యశ్రీ కార్డులోనే కుటుంబ హెల్త్ రికార్డ్ భద్రపరుచుకోవచ్చు. ఏపీలో ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్యశ్రీ కార్డుకి క్యూఆర్ కోడ్ జత చేసి, దానిలో కుటుంబ సభ్యులందరి హెల్త్ రికార్డులు ఉండేలా చూస్తోంది. ఈమేరకు సీఎం జగన్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. రాబోయే రోజుల్లో కుటుంబం మొత్తానికి కాకుండా, వ్యక్తిగతంగా ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేయాలని చెప్పారు.

విలేజ్ క్లినిక్స్, వార్డ్ క్లినిక్స్ బలోపేతం..
ఇప్పటికే గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలుండగా.. వాటితోపాటు విలేజ్ క్లినిక్స్, వార్డ్ క్లినిక్స్ పేరుతో ప్రాథమిక వైద్యాన్ని మరింత పటిష్టం చేస్తానంటోంది వైసీపీ ప్రభుత్వం. గ్రామ, వార్డు సచివాలయాలకు అనుబంధంగా వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. ఆరోగ్యశ్రీ కార్డుల్లో ఉన్న వివరాలన్నీ విలేజ్, వార్డు క్లినిక్స్ లో కూడా అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు జగన్. రాష్ట్రంలో కొవిడ్ నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

టీచర్లకు పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్..
ఈనెల 16నుంచి ఏపీలో స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతున్న సందర్భంగా.. ఆలోగా టీచర్లకు, స్కూళ్లలో పనిచేసే సిబ్బందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని చెప్పారు సీఎం జగన్. గ్రామాలు యూనిట్‌గా పరిగణలోకి తీసుకుని వ్యాక్సినేషన్‌ ఇవ్వాలని సూచించారు. ప్రజల మధ్యకు ఎక్కువగా వెళ్లేవారు, క్షేత్రస్థాయి సిబ్బంది, ఉద్యోగులకు వ్యాక్సినేషన్ లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News