ఎమ్మెల్సీ ఎన్నికలు వద్దంటూ కేసీఆర్ సేఫ్ గేమ్..
కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లోనే.. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్ పోరు జరిగింది. అలాంటిది సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిపోతున్న ఈ సందర్భంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు వద్దంటూ కేసీఆర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా సాకు చూపుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదా కోరారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ప్రత్యుత్తరం పంపారు. జూన్ 3తో తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ పోస్ట్ లు ఖాళీ అయ్యాయి. జూన్ 17న గవర్నర్ కోటాలో ఉన్న తెలంగాణ భవన్ […]
కరోనా ఉధృతంగా ఉన్న రోజుల్లోనే.. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్ పోరు జరిగింది. అలాంటిది సెకండ్ వేవ్ ప్రభావం తగ్గిపోతున్న ఈ సందర్భంలో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు వద్దంటూ కేసీఆర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా సాకు చూపుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల వాయిదా కోరారు. ఈమేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన ప్రత్యుత్తరం పంపారు.
జూన్ 3తో తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ పోస్ట్ లు ఖాళీ అయ్యాయి. జూన్ 17న గవర్నర్ కోటాలో ఉన్న తెలంగాణ భవన్ ఇంచార్జి ఎం.శ్రీనివాసరెడ్డి పదవీకాలం కూడా ముగిసింది. వీటన్నిటికీ ఎన్నికలు జరగాల్సి ఉంది. గవర్నర్ కోటా కోసం ఎమ్మెల్సీ ఎన్నిక లాంఛనమే. ఇక ఎమ్మెల్యే కోటాలో ఎన్నిక కావాల్సిన ఆరుగురు ఎలాగూ టీఆర్ఎస్ కే ఏకగ్రీవం అవుతారు. కేవలం నామమాత్రంగా ఎన్నికలు జరుగుతాయంతే. అయితే దీనికి కూడా కేసీఆర్ ఇప్పుడు ఆసక్తిగా లేరు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరపాలా వద్దా అంటూ కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయగా.. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడప్పుడే కుదరదంటూ జవాబు వెళ్లింది.
సీట్లు 6.. ఆశావహులు 20మంది..
ఎమ్మెల్సీ ఎన్నికలు, అందులోనూ ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నికలంటే చాలామంది ఆశావహులు రెడీగా ఉంటారు. ఎలాంటి కష్టనష్టాలు లేకుండా సులభంగా అయిపోయే పని అది. ఈసారి కూడా చాలామంది ఆశావహులు కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నారు. సిట్టింగ్ స్థానాలు కోరుతున్న మాజీ ఎమ్మెల్సీలు వీరికి అదనం. నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో అసమ్మతి సెగ రేగకుండా ఉండేందుకు అప్పట్లో కోటిరెడ్డికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు కేసీఆర్. అదే ఖాయమైతే.. సిట్టింగ్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డికి సామాజిక కారణాల దృష్ట్యా సీటు దూరం అవుతుంది. గ్రేటర్ ఎన్నికల్లో పద్మశాలి, రజక, కుమ్మరి, విశ్వబ్రాహ్మణ వర్గాలకు కచ్చితంగా మండలిలో స్థానం కల్పిస్తానంటూ కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆయా వర్గాలనుంచి కూడా ఆశావహులు ఎదురు చూస్తున్నారు. మాజీ స్పీకర్ మధుసూదనా చారినుంచి.. ఇటీవలే పార్టీ కండువా కప్పుకున్న ఎల్.రమణ వరకు కేసీఆర్ హామీలు బ్యాలెన్స్ ఉన్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ.. అక్కడి రాజకీయ సమీకరణాలు కూడా ఎమ్మల్సీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి.
ఈ దశలో అసలెందుకీ తలనొప్పి అనుకుంటూ కేసీఆర్ సైలెంట్ అయ్యారు. కరోనా ప్రభావం తగ్గింది, ఎమ్మెల్సీ పోస్ట్ ఖాయం అనుకుంటున్న ఆశావహులంతా ఆయన నిర్ణయంతో షాకయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలు వద్దంటున్న కేసీఆర్.. రేపు హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకుంటారా అనేది సందేహంగా మారింది. అటు హుజూరాబాద్ లో రేపోమాపో ఉప ఎన్నికల పోలింగ్ అన్నట్టు హడావిడి ఉంది. ఈ దశలో ఆ రాజకీయ వేడి చల్లారే వరకు కేసీఆర్ ఇలా సేఫ్ గేమ్ ఆడుతూనే ఉంటారా అనేది తేలాల్సి ఉంది.