8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న హీరో

రవితేజ, శరత్‌ మండవ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. దివ్యాంశా కౌశిక్, రాజీషా విజయన్‌ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఖరారైన మాస్‌ టైటిల్‌ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ రవితేజ అభిమానులతో పాటుగా సినిమా లవర్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు..టైటిల్‌కు, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుండటం చిత్ర యూనిట్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తాజాగా ‘రామారావు ఆన్‌ […]

Advertisement
Update:2021-07-29 13:37 IST

రవితేజ, శరత్‌ మండవ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. దివ్యాంశా కౌశిక్, రాజీషా విజయన్‌ ఈ చిత్రంలో హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి ఖరారైన మాస్‌ టైటిల్‌ ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ రవితేజ
అభిమానులతో పాటుగా సినిమా లవర్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు..టైటిల్‌కు, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుండటం చిత్ర యూనిట్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

తాజాగా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రం నుంచి మరో సర్‌ప్రైజింగ్‌ ఎలిమెంట్‌ బయటకు వచ్చింది. తన ఎనర్జీ, కామిక్‌ టైమింగ్‌తో ప్రేక్షకుల్లో నటుడిగా మంచి ఆదరణ, గుర్తింపు తెచ్చుకున్న తొట్టెంపూడి వేణు ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో న‌టిస్తున్నాడు. కథలో ఉన్న ఇంటెన్స్, ఆసక్తికరమైన అంశాలు ఆయన్ను ఈ చిత్రంలో నటించేందుకు ఒప్పుకునేలా చేశాయని తెలుస్తోంది. ఇప్పటివరకు వెండితెరపై తాను చేయని స‌రికొత్త క్యారెక్టర్‌ను ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రంలో చేస్తున్నాడు వేణు. దాదాపు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వేణు ఒప్పుకున్న సినిమా ఇది.

సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా, కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. ఇదొక
డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ అంటున్నారు మేకర్స్.

Tags:    
Advertisement

Similar News