కత్తి మహేశ్​ మృతిపై విచారణ.. ఏపీ సర్కార్​

ప్రముఖ సినీ విమర్శకుడు, బిగ్​బాస్​ ఫేమ్​ కత్తి మహేశ్​ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కత్తి మహేశ్​.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కత్తి మహేశ్​ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కత్తి మహేశ్​ తండ్రితో పాటు ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని వారు డిమాండ్​ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై తాజాగా […]

Advertisement
Update:2021-07-15 06:43 IST

ప్రముఖ సినీ విమర్శకుడు, బిగ్​బాస్​ ఫేమ్​ కత్తి మహేశ్​ ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కత్తి మహేశ్​.. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కత్తి మహేశ్​ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా కత్తి మహేశ్​ తండ్రితో పాటు ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించాలని వారు డిమాండ్​ చేశారు.

ఇదిలా ఉండగా.. ఈ విషయంపై తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ స్పందించారు. ’ కత్తి మహేశ్​ వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీ సానుభూతి పరుడు. ఆయన చికిత్స కోసం ఏపీ ప్రభుత్వం రూ. 17 లక్షలు సీఎం రిలీఫ్​ ఫండ్​ కూడా విడుదల చేసింది.

అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండటంతో విచారణ జరిపించాలని నిర్ణయించాం. కత్తి మహేశ్​ తిరుపతి పార్లమెంట్​ ఎన్నికల సమయంలోనూ వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించాడు. ఆయన మృతి చాలా బాధాకరం’ అంటూ ఆదిమూలపు సురేశ్​ ఓ ప్రకటన విడుదల చేశారు.
కత్తి మహేశ్​ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావడంతో.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.

Tags:    
Advertisement

Similar News