కత్తి మహేశ్​ కన్ను మూత ..!

ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్​ తుదిశ్వాస విడిచారు. గత నెల 26న నెల్లూరు జిల్లా గూడురు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన వైద్యం కోసం ఏపీ ప్రభుత్వం సీఎం రిలీఫ్​ ఫండ్​ ద్వారా రూ. 17 లక్షలు అందించింది. అప్పట్లో ఆయన తల,కంటికి తీవ్ర గాయాలైనట్టు […]

Advertisement
Update:2021-07-10 13:06 IST

ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్​ తుదిశ్వాస విడిచారు. గత నెల 26న నెల్లూరు జిల్లా గూడురు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వెంటనే ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన వైద్యం కోసం ఏపీ ప్రభుత్వం సీఎం రిలీఫ్​ ఫండ్​ ద్వారా రూ. 17 లక్షలు అందించింది. అప్పట్లో ఆయన తల,కంటికి తీవ్ర గాయాలైనట్టు వైద్యులు తెలిపారు.

అయితే ప్రస్తుతం ఊపిరితిత్తుల్లో నీరు చేరడం ద్వారా ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని.. దీంతో ఆయన మృతిచెందారని అపోలో వైద్యులు తెలిపారు. బిగ్​బాస్ షో ద్వారా కత్తి మహేశ్​ పాపులర్​ అయ్యారు. అంతకు ముందు ఆయన ఓ మీడియా చానల్​లో సినిమాల మీద రివ్యూలు చెప్పేవారు. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్​గా ఉండే కత్తి మహేశ్​ తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించేవారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు పలు మార్లు వివాదాస్పదం అయ్యాయి. రాముడిపై ఆయన చేసిన వ్యాఖ్యలతో హిందూ సంఘాలు మండిపడ్డాయి. మరోవైపు పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్​ను కించపరుస్తూ కూడా ఆయన ఫేస్​బుక్​లో పోస్టులు పెట్టేవాడు. ఇదిలా ఉంటే పలు చిత్రాల్లో సైతం కత్తి మహేశ్​ నటించి మెప్పించాడు.

పెసరట్టు అనే ఓ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించాడు. ఇక కొబ్బరి మట్ట, అమ్మరాజ్యంలో కడపరెడ్లు వంటి చిత్రాల్లో ఆయనకు మంచి పాత్రలు దక్కాయి.కత్తి మహేశ్​ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖలు తమ సంతాపం తెలిపారు. ఇక నెటిజన్లు సైతం ఆయన మృతికి సంతాపం తెలిపారు.

Advertisement

Similar News