రేవంత్​ టీడీపీ అయితే మీ నాన్న ఏంటి? ఎంపీ అర‌వింద్‌..!

రేవంత్​ పీసీసీ అధ్యక్షుడు కావడంతో తెలంగాణ రాజకీయాలు హీట్​ ఎక్కాయి. వర్కింగ్​ ప్రెసిడెంట్​గా ఉన్నప్పుడే దూకుడుగా వ్యవహరించే రేవంత్​రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడయ్యాక అస్సలు తగ్గడం లేదు. కేసీఆర్​పై, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. టీఆర్​ఎస్​ నుంచి అధికారం లాక్కొంటానని కూడా ప్రకటించారు. ఇక రేవంత్​ రెడ్డి ఆరోపణలపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ ఘాటుగా స్పందించారు. ఆయనలో ఇంకా టీడీపీ రక్తం పోలేదని.. గతంలో సోనియాగాంధీని దయ్యం, భూతం అని అభివర్ణించి.. ఇప్పుడేమో తెలంగాణ తల్లి […]

Advertisement
Update:2021-07-10 14:51 IST

రేవంత్​ పీసీసీ అధ్యక్షుడు కావడంతో తెలంగాణ రాజకీయాలు హీట్​ ఎక్కాయి. వర్కింగ్​ ప్రెసిడెంట్​గా ఉన్నప్పుడే దూకుడుగా వ్యవహరించే రేవంత్​రెడ్డి.. పీసీసీ అధ్యక్షుడయ్యాక అస్సలు తగ్గడం లేదు. కేసీఆర్​పై, తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. టీఆర్​ఎస్​ నుంచి అధికారం లాక్కొంటానని కూడా ప్రకటించారు.

ఇక రేవంత్​ రెడ్డి ఆరోపణలపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ ఘాటుగా స్పందించారు. ఆయనలో ఇంకా టీడీపీ రక్తం పోలేదని.. గతంలో సోనియాగాంధీని దయ్యం, భూతం అని అభివర్ణించి.. ఇప్పుడేమో తెలంగాణ తల్లి అంటున్నాడని.. త్వరలో చంద్రబాబును తెలంగాణ తండ్రి అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కేటీఆర్​ వ్యాఖ్యానించారు.

కేటీఆర్​ వ్యాఖ్యలపై రేవంత్​ కూడా స్పందించారు. ఈ వాగ్వాదం ఇలా కొనసాగుతోంది. ఇదిలా ఉంటే కేటీఆర్​ వ్యాఖ్యలపై ఇవాళ ఆశ్చర్యకరంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర‌వింద్‌​ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్​రెడ్డి టీడీపీ మనిషి అయితే.. కేసీఆర్​ కూడా టీడీపీ మనిషే కదా? దీనికేమంటావు కేటీఆర్​? అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో హాట్​ టాపిక్​గా మారాయి.

కేటీఆర్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు రేవంత్​ను విమర్శిస్తే.. టీ కాంగ్రెస్​ నుంచి కూడా పెద్దగా స్పందన రాలేదు. రేవంత్​ రెడ్డి ఆయన అనుచరులు ఒకరిద్దరూ మాత్రమే ఈ వ్యాఖ్యలను ఖండించారు. కానీ కేటీఆర్​ వ్యాఖ్యలను అర‌వింద్‌​ ఖండించడం గమనార్హం.

Tags:    
Advertisement

Similar News