టీడీపీకి రమణ రాజీనామా.. టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటన
టీటీడీపీ అధ్యక్షుడు రమణ.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను త్వరలో టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. తన ఎదుగుదలకు ఎంతో సహకరించిన చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు ప్రకటించారు. ‘నేను తెలుగుదేశం పార్టీలో చేరి ఈ స్థాయికి ఎదిగాను. ఈ సందర్భంగా టీడీపీ అధినేతకు ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరుగుతోంది. సామాజిక చైతన్యం కోసం సీఎం […]
టీటీడీపీ అధ్యక్షుడు రమణ.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాను త్వరలో టీఆర్ఎస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు. తన ఎదుగుదలకు ఎంతో సహకరించిన చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు ప్రకటించారు. ‘నేను తెలుగుదేశం పార్టీలో చేరి ఈ స్థాయికి ఎదిగాను. ఈ సందర్భంగా టీడీపీ అధినేతకు ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ప్రస్తుతం తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరుగుతోంది. సామాజిక చైతన్యం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. అందుకే నేను టీఆర్ఎస్లో చేరుతున్నాను.
కరోనా కట్టడిలోనూ బడుగు, బలహీనవర్గాలకు మేలు చేయడంలో సీఎం కేసీఆర్ ఎంతో పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. ఆయన పిలుపుతో నేను టీఆర్ఎస్లో చేరుతున్నాను. కార్యకర్తలతో సమావేశమై వారి అభీష్టం మేరకే టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నాను’ అంటూ రమణ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు.
ఇక రమణ గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా సమావేశమైన విషయం తెలిసిందే. దాదాపు గంటన్నర పాటు వీరు వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో రమణ మాజీ సహచరుడు ఎర్రబెల్లి దయాకర్రావు కూడా వెంట ఉన్నారు. అయితే సముచిత స్థానం ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన అనంతరమే రమణ.. టీఆర్ఎస్లో చేరినట్టు సమాచారం.
త్వరలో ఎమ్మెల్సీల నియామకం చేపట్టనున్నారు. ఈ క్రమంలో రమణ తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారట. అందుకు సీఎం కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రమణ పోటీచేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా రమణను టీఆర్ఎస్లో చేర్చుకున్నట్టు సమాచారం.
ఇటీవల ఈటల రాజేందర్ టీఆర్ఎస్ను వీడిన విషయం తెలిసిందే. ఆయన మీద అవినీతి ఆరోపణలు రావడం.. రాజీనామా చేయడంతో.. బీసీ వర్గాల్లో కొంత అసంతృప్తి నెలకొన్నది. ఆ అసంతృప్తిని చల్లార్చేందుకు రమణను చేర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. రమణ పద్మశాలి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఆయన చేరికతో తమకు నేతన్నల అండదండలు ఉంటాయని కేసీఆర్ భావిస్తున్నారట.