సీఎం కేసీఆర్​తో ఎల్​ రమణ భేటీ..! టీఆర్ ఎస్ లో చేరికకు రంగం సిద్ధం

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్​ రమణ.. టీఆర్​ఎస్​లో చేరడం దాదాపు ఖరారైంది. గురువారం రమణ.. తన మాజీ సహచరుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుతో కలిసి ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​ను కలిశారు. ఈ సందర్భంగా రమణను కేసీఆర్​ టీఆర్​ఎస్​లోకి ఆహ్వానించారని ఎర్రబెల్లి తెలిపారు. సీఎం కేసీఆర్​ ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారట. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులపై వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. రమణ టీడీపీని […]

Advertisement
Update:2021-07-09 06:22 IST

టీటీడీపీ అధ్యక్షుడు ఎల్​ రమణ.. టీఆర్​ఎస్​లో చేరడం దాదాపు ఖరారైంది. గురువారం రమణ.. తన మాజీ సహచరుడు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుతో కలిసి ప్రగతి భవన్​లో సీఎం కేసీఆర్​ను కలిశారు. ఈ సందర్భంగా రమణను కేసీఆర్​ టీఆర్​ఎస్​లోకి ఆహ్వానించారని ఎర్రబెల్లి తెలిపారు. సీఎం కేసీఆర్​ ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారట. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులపై వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.

రమణ టీడీపీని వీడబోతున్నారని.. టీఆర్​ఎస్​లో చేరబోతున్నారని చాలా రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన కేసీఆర్​తో భేటీ కావడంతో ఆ వార్తలు నిజమయ్యాయి. సీఎం కేసీఆర్​ ఆహ్వానానికి రమణ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారట.

ఈ భేటీ అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు మీడియా మాట్లాడుతూ.. కేసీఆర్​ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేనేతలకు ఎంతో మేలు చేస్తోందని పేర్కొన్నారు. రమణ అంటే సీఎం కేసీఆర్​కు ప్రత్యేక అభిమానం ఉందని అందుకే ఆయనను పార్టీలోకి ఆహ్వానించారని చెప్పుకొచ్చారు.

హుజూరాబాద్​ అభ్యర్థా? ఎమ్మెల్సీ ఆఫరా?

ఈటల రాజేందర్​ రాజీనామాతో హుజురాబాద్​కు ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఇక్కడ అప్పుడే రాజకీయ పార్టీలు ప్రచారం కూడా మొదలుపెట్టాయి. బీజేపీ అభ్యర్థిగా ఈటల రంగంలోకి దిగుతున్నారు. ఇక టీఆర్​ఎస్​ తన మంత్రులు, ఎమ్మెల్యేలతో నిత్యం హుజూరాబాద్​ లో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పరోక్షంగా అక్కడ ప్రచారం చేస్తున్నారు. దీంతో హుజూరాబాద్​లో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది.

ఇదిలా ఉంటే హుజూరాబాద్​ టీఆర్​ఎస్​ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. దీంతో అక్కడ రమణను అభ్యర్థిగా ప్రకటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన బీసీ కావడంతో ఆ అంశం కలిసి వస్తుందని భావిస్తున్నారట. దీనిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. అయితే రమణకు సీఎం కేసీఆర్​ ఎమ్మెల్సీ ఆఫర్​ కూడా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో కొన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ క్రమంలో రమణకు అవకాశం ఇవ్వబోతున్నారని టాక్​. ఏం జరుగబోతున్నదో వేచి చూడాలి.

Tags:    
Advertisement

Similar News