పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌పై కేసు ..!
పీసీసీ అధ్యక్షుడిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదుచేశారు. బుధవారం గాంధీ భవన్లో అట్టహాసంగా రేవంత్ ప్రమాణ స్వీకారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు నగరంలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్ ఎస్సై యాకన్న పోలీసులకు ఫిర్యాదు […]
పీసీసీ అధ్యక్షుడిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదుచేశారు. బుధవారం గాంధీ భవన్లో అట్టహాసంగా రేవంత్ ప్రమాణ స్వీకారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు నగరంలో ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి నుంచి గాంధీ భవన్ వరకు ర్యాలీ కొనసాగింది.
ఈ ర్యాలీలో కాంగ్రెస్ శ్రేణులు, రేవంత్ అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే రేవంత్‌రెడ్డిపై జూబ్లీహిల్స్ ఎస్సై యాకన్న పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. రేవంత్ రెడ్డి అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు జూబ్లీ హిల్స్ ప్రాంతంలో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలిగించారని.. పలు రోడ్లు బ్లాక్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డిపై ఓ ఎస్సై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఈ కేసుపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇక గాంధీ భవన్లో ప్రమాణం చేసిన అనంతరం రేవంత్‌రెడ్డి.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మరోవైపు రేవంత్ పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.