నాన్నా..నీ అడుగుజాడల్లోనే..!

దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్​ రాజశేఖర్​రెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు వైఎస్​ సేవలను గుర్తుచేసుకుంటున్నారు. సంక్షేమ పథకాలతో వైఎస్​ఆర్​ పేద ప్రజల గుండెల్లో ఇప్పటికీ బతికే ఉన్నారని పలువురు నేతలు ట్వీట్ చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్​ కార్యకర్తలు, ఏపీకి చెందిన వైఎస్సార్​సీపీ, కాంగ్రెస్​ కార్యకర్తలు మహానేతకు నివాళి అర్పించారు. వైఎస్ విజయమ్మ, షర్మిల ఇడుపుల పాయలోని వైఎస్​ ఆర్​ ఘాట్​ […]

Advertisement
Update:2021-07-08 08:49 IST

దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్​ రాజశేఖర్​రెడ్డి జయంతి నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళి అర్పించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు వైఎస్​ సేవలను గుర్తుచేసుకుంటున్నారు. సంక్షేమ పథకాలతో వైఎస్​ఆర్​ పేద ప్రజల గుండెల్లో ఇప్పటికీ బతికే ఉన్నారని పలువురు నేతలు ట్వీట్ చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్​ కార్యకర్తలు, ఏపీకి చెందిన వైఎస్సార్​సీపీ, కాంగ్రెస్​ కార్యకర్తలు మహానేతకు నివాళి అర్పించారు.

వైఎస్ విజయమ్మ, షర్మిల ఇడుపుల పాయలోని వైఎస్​ ఆర్​ ఘాట్​ వద్ద నివాళి అర్పించారు. సీఎం జ‌గ‌న్ త‌న తండ్రిని గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్ చేశారు. ‘చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం. పోరాడే గుణం నువ్వు ఇచ్చిన బలమే. మాట తప్పని తనం నువ్వే నేర్పావు. నీ ఆశయాలే నాకు వారసత్వం’ అంటూ జగన్​ ట్వీట్ చేశారు.

తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పలువురు నాయకులు వైఎస్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. వైఎస్​ రాజశేఖర్​రెడ్డి సేవలను కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబం వైఎస్​ఆర్​ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ఏదో రకంగా లబ్ధిపొందిందని ఆయన కొనియాడారు.

మరోవైపు తెలంగాణ కాంగ్రెస్​ నేతలు కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి వైఎస్​ఆర్​కు నివాళి అర్పించారు. జీవన్​ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్​ ఆర్​కు భారతరత్న ఇవ్వాలంటూ డిమాండ్​ చేయడం గమనార్హం. ఇక పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి సైతం గాంధీ భవన్​లో వైఎస్​ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.

Tags:    
Advertisement

Similar News