వ్యాక్సిన్ మూడో డోసు ఎవరికి అవసరం?

వ్యాక్సిన్ ఒక్కడోసుతోనే తగినన్ని యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని డాక్టర్లు చెప్తున్నారు. రెండో డోసు కూడా వేసుకుంటే కోవిడ్ తో వచ్చే ముప్పుని దాదాపు తగ్గించుకోవచ్చు. అయితే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉన్న కొంతమందికి కరోనా వ్యాక్సిన్ మూడు డోసులు ఇవ్వాలని చెప్తున్నాయి తాజా స్టడీలు. అసలు మూడో డోసు ఎవరికి అవసరమంటే.. ఇమ్యూనిటీ ఇష్యూస్ తో ఇబ్బంది పడుతున్నవారికి వ్యాక్సిన్ మరిన్ని డోసులు అవసరమవుతాయని కొన్ని స్టడీలు చెప్తున్నాయి. ఒరేగావ్‌లో డ‌యాల‌సిస్‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్న ఎస్తర్ జోన్స్ అనే […]

Advertisement
Update:2021-07-06 07:23 IST

వ్యాక్సిన్ ఒక్కడోసుతోనే తగినన్ని యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని డాక్టర్లు చెప్తున్నారు. రెండో డోసు కూడా వేసుకుంటే కోవిడ్ తో వచ్చే ముప్పుని దాదాపు తగ్గించుకోవచ్చు. అయితే ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉన్న కొంతమందికి కరోనా వ్యాక్సిన్ మూడు డోసులు ఇవ్వాలని చెప్తున్నాయి తాజా స్టడీలు. అసలు మూడో డోసు ఎవరికి అవసరమంటే..

ఇమ్యూనిటీ ఇష్యూస్ తో ఇబ్బంది పడుతున్నవారికి వ్యాక్సిన్ మరిన్ని డోసులు అవసరమవుతాయని కొన్ని స్టడీలు చెప్తున్నాయి. ఒరేగావ్‌లో డ‌యాల‌సిస్‌పై ఆధార‌ప‌డి జీవిస్తున్న ఎస్తర్ జోన్స్ అనే న‌ర్సు.. ఫైజ‌ర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. అయినప్పటికీ శరీరంలో యాంటీబాడీలు డెవలప్ కాలేదు. మూడ‌వ డోసుగా ఆమె మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్న త‌ర్వాత యాంటీబాడీల స్పంద‌న మొదలైనట్టు తెలిసింది. అయితే యాంటీబాడీలు మ‌రింత పెరుగుతాయ‌నే ఆశ‌తో ఆమె గ‌త నెల‌లో నాలుగో డోస్ కూడా తీసుకున్నారు.

కిడ్నీ మార్పిడి చేయించుకుని డయాలసిస్ మీద ఆధారపడిన జోన్స్.. ఇమ్యూనిటీని అణిచివేసే మందులు వాడక తప్పట్లేదు. అందుకే ఆమెకు నాలుగు డోసుల వ్యాక్సిన్ అవసరమైంది. అయితే ఇలాంటి కొన్ని పరిస్థితుల్లో ఇమ్యూనిటీ ఇష్యూస్ ఉన్నవారికి ఓ ప్రత్యేక ప్రణాళిక తో మూడు లేదా నాలుగు డోసుల వ్యాక్సిన్ అందించేలా డాక్టర్లు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్‌లో ఇమ్యూనిటీ సమస్యలున్న కొంతమంది ఆరోగ్య సిబ్బంది వారికి వ్యాక్సిన్ మూడో డోస్ అందిస్తున్నారు.

ప్రపంచంలో 5 శాతం జ‌నాభా ఇలాంటి స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్నారు. అవ‌య‌వ మార్పిడి, కొన్ని ర‌కాల క్యాన్సర్లు, కిడ్నీ వ్యాధులతో బాధ పడే వారిలో ఇమ్యూనిటీ సమస్యలు తీవ్రంగా ఉంటాయి. అందుకే వ్యాక్సినేష‌న్ ప్రక్రియ‌లో ఇలాంటి వారికోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని నిపుణులు భావిస్తున్నారు

Tags:    
Advertisement

Similar News