మాస్ రాజ్ నుంచి మరో మూవీ
ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఆ మూవీ సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా స్టార్ట్ చేశాడు. కొత్త దర్శకుడు శరత్ మండవతో కలిసి ఈరోజు సెట్స్ పైకి వచ్చాడు రవితేజ. కెరీర్ లో రవితేజకు ఇది 68వ సినిమా. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా SLV సినిమాస్, ఆర్ టి టీమ్ వర్క్స్ పతాకాలపై రూపొందుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. రవితేజ మరియు ఇతర తారాగణంపై హైదరాబాద్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. […]
ప్రస్తుతం ఖిలాడీ సినిమా చేస్తున్నాడు రవితేజ. ఆ మూవీ సెట్స్ పై ఉంటుండగానే మరో సినిమా స్టార్ట్ చేశాడు. కొత్త దర్శకుడు శరత్ మండవతో కలిసి ఈరోజు సెట్స్ పైకి వచ్చాడు రవితేజ. కెరీర్ లో రవితేజకు ఇది 68వ సినిమా.
సుధాకర్ చెరుకూరి నిర్మాతగా SLV సినిమాస్, ఆర్ టి టీమ్ వర్క్స్ పతాకాలపై రూపొందుతున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. రవితేజ మరియు ఇతర తారాగణంపై హైదరాబాద్‌లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కార్యాలయం ముందు రవితేజ అటువైపు తిరిగి కుర్చొని ఎదో టైప్ చేస్తున్నట్టు చూపించారు. పోస్టర్‌లోని కనిపిస్తున్న అగ్ని రవితేజ పాత్ర యెక్క ఇంటెన్సిటిని చూపించే విధంగా ఉంది.
రియల్ ఇన్స్‌డెంట్స్ ఆధారంగా ఒక యూనిక్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందబోతుంది. రవితేజ సరసన మజిలి ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు స్యామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు.