తొలిడోసు కోవిషీల్డ్, రెండో డోసు ఫైజర్.. ఎంతో బెస్ట్ ..! తేల్చిన ఆక్స్ఫర్డ్ వర్సిటీ
ప్రస్తుతం మనదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తొలి డోసులో ఏ వ్యాక్సిన్ అయితే ఇస్తున్నారో? రెండో డోసులోనూ అదే వ్యాక్సిన్‌ను రిపీట్ చేస్తున్నారు. అయితే బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అదేమిటంటే తొలిడోసు కింద కోవిషీల్డ్, రెండో డోసు కింద ఫైజర్ వ్యాక్సిన్ ఇస్తే.. మెరుగైన ఫలితాలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల.. రోగ నిరోధకశక్తి ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. ఈ మేరకు సైంటిస్టులు శాస్త్రీయ ఆధారాలు […]
ప్రస్తుతం మనదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తొలి డోసులో ఏ వ్యాక్సిన్ అయితే ఇస్తున్నారో? రెండో డోసులోనూ అదే వ్యాక్సిన్‌ను రిపీట్ చేస్తున్నారు. అయితే బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. అదేమిటంటే తొలిడోసు కింద కోవిషీల్డ్, రెండో డోసు కింద ఫైజర్ వ్యాక్సిన్ ఇస్తే.. మెరుగైన ఫలితాలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇలా చేయడం వల్ల.. రోగ నిరోధకశక్తి ఎక్కువగా వస్తుందని చెబుతున్నారు. ఈ మేరకు సైంటిస్టులు శాస్త్రీయ ఆధారాలు చూపిస్తున్నారు. ఇటీవల మొత్తం 830 మంది మీద ఈ మేరకు ప్రయోగాలు చేశారు.
57 ఏళ్ల వయసు ఉన్నవారిని ఈ ప్రయోగానికి ఎంచుకున్నారు. ఇందులో మొదటి డోసు కోవిషీల్డ్, రెండో డోసు ఫైజర్ ఇచ్చిన వారిలో ఇమ్యూనిటీ ఎక్కువగా అభివృద్ధి చెందింది. అదే రెండు డోసులు కోవిషీల్డ్ ఇచ్చిన వారి కంటే.. డోసు మార్చిన ఇచ్చిన వారిలో ఎక్కువగా రోగనిరోధకశక్తి పెరిగింది.
కోవిడ్ కారక సార్స్-కొవ్-2 వైరస్‌లోని స్పైక్ ప్రొటీన్‌కు వ్యతిరేకంగా ఎక్కువ యాంటీబాడీలు ఉత్పన్నమవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. అయితే తొలుత ఫైజర్ డోసు ఇచ్చి.. ఆ తర్వాత కోవిషీల్డ్ ఇస్తే పెద్దగా ఫలితం ఉండటం లేదని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ దిశగా మరికొన్ని ప్రయోగాలు సాగాల్సి ఉందని వారు అంటున్నారు.