భారత్ లో మోడెర్నా టీకా పంపిణీకి అత్యవసర అనుమతి..

భారత్ లో మరో కొత్త టీకా పంపిణీకి రంగం సిద్ధమైంది. అమెరికా కంపెనీ మోడెర్నా తయారు చేసిన టీకాను భారత్ లో పంపిణీ చేసేందుకు సిప్లా కంపెనీ డీసీజీఐ అనుమతి సాధించింది. గతంలో నిబంధనలు కాస్త కఠినతరంగా ఉన్నా.. ఇటీవల వాటిని సడలించారు. విదేశాల్లో అనుమతులు పొందిన టీకాలకు మన దేశంలో క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహించకుండానే పంపిణీ చేసేందుకు అనుమతులిస్తున్నారు. ఈ దిశగా తొలి అనుమతి సిప్లాకు లభించింది. నేరుగా టీకాను దిగుమతి చేసుకుని ఇక్కడ పంపిణీ […]

Advertisement
Update:2021-06-29 13:08 IST

భారత్ లో మరో కొత్త టీకా పంపిణీకి రంగం సిద్ధమైంది. అమెరికా కంపెనీ మోడెర్నా తయారు చేసిన టీకాను భారత్ లో పంపిణీ చేసేందుకు సిప్లా కంపెనీ డీసీజీఐ అనుమతి సాధించింది. గతంలో నిబంధనలు కాస్త కఠినతరంగా ఉన్నా.. ఇటీవల వాటిని సడలించారు. విదేశాల్లో అనుమతులు పొందిన టీకాలకు మన దేశంలో క్లినికల్‌ ట్రయల్స్ నిర్వహించకుండానే పంపిణీ చేసేందుకు అనుమతులిస్తున్నారు. ఈ దిశగా తొలి అనుమతి సిప్లాకు లభించింది. నేరుగా టీకాను దిగుమతి చేసుకుని ఇక్కడ పంపిణీ చేయడానికి మోడెర్నాతో సిప్లా ఒప్పందం కుదుర్చుకుంది.

భారత్ బయోటెక్ కంపెనీ దేశీయంగా కోవాక్సిన్ తయారు చేస్తోంది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్త ఉత్పాదన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను సీరం సంస్థ మన దేశంలో తయారు చేసి పంపిణీ చేస్తోంది. ఇక ఇటీవలే స్పుత్నిక్-వి టీకాను డాక్టర్ రెడ్డీస్ సంస్థ రష్యానుంచి దిగుమతి చేసుకుంటోంది. త్వరలోనే స్పుత్నిక్ టెక్నాలజీ కూడా దిగుమతి చేసుకుని దేశీయంగానే ఈ టీకాను కూడా తయారు చేస్తామంటున్నారు. అయితే ఇంకా స్పుత్నిక్-వి టీకా పంపిణీ జోరందుకోలేదు. ఇప్పుడు కొత్తగా మోడెర్నాకు కేంద్రం అనుమతి ఇచ్చింది. మోడెర్నా టీకాను నేరుగా దిగుమతి చేసుకుని పంపిణీ చేస్తారు. ఎం-ఆర్ఎన్ఏ టెక్నాలజీతో ఈ టీకాను అభివృద్ధి చేశారు.

సిప్లా కంపెనీ మోడెర్నా టీకా పంపిణీ కోసం సోమవారం డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. ఒకరోజు వ్యవధిలోనే అత్యవసర అనుమతి మంజూరైంది. అయితే టీకా పంపిణీ చేపట్టిన తర్వాత తొలి 100 మంది లబ్ధిదారులకు సంబంధించి 7 రోజుల ఆరోగ్య పరిస్థితి నివేదకను సిప్లా సంస్థ సమర్పించాల్సి ఉంటుంది.
క్లినికల్‌ టెస్టుల్లో ఈ టీకా సమర్థత 90శాతానికి పైగా ఉందని కంపెనీ తెలిపింది.

Tags:    
Advertisement

Similar News