పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్​రెడ్డి

ఎన్నో రోజుల ఉత్కంఠకు తెరపడింది. రేవంత్​రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ఏఐసీసీ ప్రకటించింది. పీసీసీ అధ్యక్షుడితో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులను, ఉపాధ్యక్షులను సైతం ఏఐసీసీ నియమించింది. మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్​ను ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్​గా నియమించింది. మహ్మద్​ అజహరుద్దీన్​, జే గీతారెడ్డి, ఎం అంజన్​ కుమార్​ యాదవ్​, టీ జగ్గారెడ్డి, బీ మహేశ్​ కుమార్​ గౌడ్​లను వర్కింగ్​ ప్రెసిడెంట్లుగా నియమించారు. చంద్రశేఖర్​ సంబాని, దామోదర్​రెడ్డి, మల్లు రవి, పొదెం వీరయ్య, సురేశ్​ షెట్కర్​, వేం […]

Advertisement
Update:2021-06-26 17:04 IST

ఎన్నో రోజుల ఉత్కంఠకు తెరపడింది. రేవంత్​రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్టు ఏఐసీసీ ప్రకటించింది. పీసీసీ అధ్యక్షుడితో పాటు కార్యనిర్వాహక అధ్యక్షులను, ఉపాధ్యక్షులను సైతం ఏఐసీసీ నియమించింది. మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్​ను ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్​గా నియమించింది.
మహ్మద్​ అజహరుద్దీన్​, జే గీతారెడ్డి, ఎం అంజన్​ కుమార్​ యాదవ్​, టీ జగ్గారెడ్డి, బీ మహేశ్​ కుమార్​ గౌడ్​లను వర్కింగ్​ ప్రెసిడెంట్లుగా నియమించారు.

చంద్రశేఖర్​ సంబాని, దామోదర్​రెడ్డి, మల్లు రవి, పొదెం వీరయ్య, సురేశ్​ షెట్కర్​, వేం నరేందర్​రెడ్డి, రమేశ్​ ముదిరాజ్​, గోపిశెట్టి నిరంజన్​, టీ కుమార్​ రావు, జావేద్​ అమీర్​లను సీనియర్​ ఉపాధ్యక్షులుగా నియమించారు. ప్రచార కమిటీ కన్వీనర్​గా సయ్యద్​ అజ్మతుల్లా హుస్సేనీలను ఎంపిక చేసింది. ఎన్నికల మేనేజ్​మెంట్​ చైర్మన్​గా దామోదర రాజనర్సింహను ఎంపిక చేసింది.

ఏఐసీసీ ప్రోగ్రామ్​ అమలు కమిటీ చైర్మన్​గా అల్లేటి మహేశ్వర్​రెడ్డిని నియమించింది. పీసీసీ అధ్యక్షుడి నియామకం చాలా రోజులుగా పెండింగ్​లో ఉండిపోయింది. కాంగ్రెస్​ సీనియర్​ కోమటిరెడ్డి, రేవంత్​రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించాయి. చివరకు అధిష్ఠానం రేవంత్​వైపే మొగ్గుచూపింది. ఉమ్మడి పాలమూరు జిల్లా.. ప్రస్తుత నాగర్​కర్నూల్​ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో రేవంత్​రెడ్డి జన్మించారు. ఆయన తొలుత టీఆర్​ఎస్​ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. అనంతరం ఆయన కాంగ్రెస్​ పార్టీలో చేరారు.

రేవంత్​రెడ్డికి గొప్ప వాగ్దాటి సొంతం. ఆయనకు దూకుడు కూడా ఎక్కువే. ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్​ఎస్​ లాంటి బలమైన పార్టీని ఢీకొట్టాలంటే రేవంత్​రెడ్డే సరైన నేత అని కాంగ్రెస్​ హైకమాండ్​ భావించినట్టు ఉంది. అయితే రేవంత్​రెడ్డిపై అనేక విమర్శలు సైతం ఉన్నాయి. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఓటు కు నోటు కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది.

Tags:    
Advertisement

Similar News