సురేష్ బాబును మోసం చేసిన నాగార్జున
నిర్మాత సురేష్ బాబు మోసపోయారు. ఓ మోసగాడి చేతిలో అడ్డంగా బుక్కయిపోయారు. అతడి పేరు నాగార్జున. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీస్ కేసు ఫైల్ అయింది. ఇందులో చాలా ట్విస్టులున్నాయి. అవేంటో చూసేయండి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చురుగ్గా సాగుతోంది. కొన్ని సంస్థలు తమకుతాముగా తమ సిబ్బంది కోసం వ్యాక్సిన్ డ్రైవ్ లు ఏర్పాటుచేస్తున్నాయి. రీసెంట్ గా దిల్ రాజు కూడా తన సిబ్బంది మొత్తానికి వ్యాక్సిన్ వేయించారు. సురేష్ బాబు కూడా ఇలానే […]
నిర్మాత సురేష్ బాబు మోసపోయారు. ఓ మోసగాడి చేతిలో అడ్డంగా బుక్కయిపోయారు. అతడి పేరు
నాగార్జున. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీస్ కేసు ఫైల్ అయింది. ఇందులో చాలా ట్విస్టులున్నాయి.
అవేంటో చూసేయండి.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చురుగ్గా సాగుతోంది. కొన్ని సంస్థలు తమకుతాముగా తమ
సిబ్బంది కోసం వ్యాక్సిన్ డ్రైవ్ లు ఏర్పాటుచేస్తున్నాయి. రీసెంట్ గా దిల్ రాజు కూడా తన సిబ్బంది
మొత్తానికి వ్యాక్సిన్ వేయించారు. సురేష్ బాబు కూడా ఇలానే చేయాలనుకున్నారు. అంతలోనే నాగార్జున
రెడ్డి అనే వ్యక్తి టచ్ లోకి వచ్చాడు. తన వద్ద 500 డోసుల వ్యాక్సిన్ రెడీగా ఉందని, లక్ష రూపాయలు
అడ్వాన్స్ కడితే.. మొత్త మెటీరియల్ తో రామానాయుడు స్టుడియోస్ లో వాలిపోతానని చెప్పాడు.
3-4 రోజుల పాటు సంప్రదింపులు జరిపిన తర్వాత నాగార్జున చెప్పిన ఎకౌంట్ లోకి లక్ష రూపాయలు
ట్రాన్సఫర్ చేశారు సురేష్ బాబు. ఆ తర్వాత నాగార్జున ఫోన్ స్విచాఫ్ అయిపోయింది. దీంతో తను
మోసపోయానని గ్రహించిన సురేష్ బాబు, పోలీసుల్ని ఆశ్రయించారు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అప్పటికే సదరు నాగార్జున రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందరికీ
వ్యాక్సిన్ వేయిస్తానంటూ ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ ను బురిడీ కొట్టించాడు ఈ వ్యక్తి. ఆ కేసులో 4
రోజుల కిందట నాగార్జునను అరెస్ట్ చేసి సంగారెడ్డి జైలులో ఉంచారు. ఇప్పుడు సురేష్ బాబు కేసు కూడా
దీనికి యాడ్ అయింది.