నాని నిర్మాతగా మరో సినిమా

ఊహించని విధంగా సడెన్ గా కొత్త సినిమా డీటెయిల్స్ తో వచ్చాడు నాని. మీట్ క్యూట్ అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు. ప్రకటించడమే కాదు, ఆ సినిమా లాంఛింగ్ కూడా ఈరోజు జరిగిపోయింది. దానికి సంబంధించి 2 స్టిల్స్ కూడా నాని స్వయంగా రిలీజ్ చేశాడు. అయితే ఇది నాని హీరోగా నటిస్తున్న సినిమా కాదు. తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాపై నిర్మాతగా నాని తెరకెక్కిస్తున్న సినిమా. ఈ ప్రాజెక్టుకు మరో ప్రత్యేకత ఏంటంటే.. […]

Advertisement
Update:2021-06-14 15:21 IST

ఊహించని విధంగా సడెన్ గా కొత్త సినిమా డీటెయిల్స్ తో వచ్చాడు నాని. మీట్ క్యూట్ అనే సినిమాను ఎనౌన్స్ చేశాడు. ప్రకటించడమే కాదు, ఆ సినిమా లాంఛింగ్ కూడా ఈరోజు జరిగిపోయింది. దానికి సంబంధించి 2 స్టిల్స్ కూడా నాని స్వయంగా రిలీజ్ చేశాడు.

అయితే ఇది నాని హీరోగా నటిస్తున్న సినిమా కాదు. తన సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాపై నిర్మాతగా నాని తెరకెక్కిస్తున్న సినిమా. ఈ ప్రాజెక్టుకు మరో ప్రత్యేకత ఏంటంటే.. నాని సిస్టర్ దీప్తి ఈ మూవీతో డైరక్టర్ గా పరిచయమౌతున్నారు.

మీట్ క్యూట్ అనేది ఓ ఫిమేల్ సబ్జెక్ట్. ఇందులో ముగ్గురు నలుగురు హీరోయిన్లు నటిస్తారని టాక్. ఈరోజు లొకేషన్ లో మాత్రం ఎవ్వరూ కనిపించలేదు. కేవలం సత్యరాజ్ మాత్రమే కనిపించాడు. అతడిపైనే పస్ట్ షాట్ కు క్లాప్ కొట్టాడు నాని.

కరోనా వల్ల గ్రాండ్ గా జరగాల్సిన లాంఛింగ్ గుంభనంగా జరిగిపోయింది. హీరోయిన్లు ఎవరనే విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తారు. విజయ్ బుల్గానిన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

Tags:    
Advertisement

Similar News