అన్నిచోట్లా ఆనందయ్య మందు..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య తయారుచేస్తున్న మందు ఈరోజునుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే ఫస్ట్ ప్రయారిటీ అంటున్న ఆనందయ్య, ఆ తర్వాత మిగతా ప్రాంతాల వారికి ఇస్తామంటున్నారు. అయితే అదే సమయంలో తమ ప్రాంత వాసులకి కూడా ఆనందయ్య మందు అందించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్, ఆనందయ్య శిష్యబృందాన్ని తీసుకెళ్లి తిరుపతిలో తయారీ మొదలు పెట్టారు. బ్రాంచ్-2 తిరుపతి.. ఆనందయ్య మందు […]

Advertisement
Update:2021-06-07 03:16 IST

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో ఆనందయ్య తయారుచేస్తున్న మందు ఈరోజునుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుంది. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకే ఫస్ట్ ప్రయారిటీ అంటున్న ఆనందయ్య, ఆ తర్వాత మిగతా ప్రాంతాల వారికి ఇస్తామంటున్నారు. అయితే అదే సమయంలో తమ ప్రాంత వాసులకి కూడా ఆనందయ్య మందు అందించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆనందయ్య కుమారుడు శ్రీధర్, ఆనందయ్య శిష్యబృందాన్ని తీసుకెళ్లి తిరుపతిలో తయారీ మొదలు పెట్టారు.

బ్రాంచ్-2 తిరుపతి..
ఆనందయ్య మందు తయారి ప్రధాన బ్రాంచ్ కృష్ణపట్నం అయితే, రెండో బ్రాంచ్ తిరుపతి అని తెలుస్తోంది. వాస్తవానికి ఆనందయ్య మందుని టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో తయారు చేయించాలని భావించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల బృందాన్ని కృష్ణపట్నం తీసుకెళ్లి.. ఫార్ములా తెలుసుకుని వచ్చారు. ఆ తర్వాత కాలేజీలో కూడా కొన్ని ప్రయోగాలు జరిగాయి. ఆనందయ్య మందులో హానికర పదార్థాలేవీ లేవనేది వాస్తవమే అయినా, ఆ మందుతో కరోనా నివారణ అవుతుందని అధికారికంగా తేలకపోవడంతో టీటీడీ చివరి నిమిషంలో తన ప్రతిపాదన విరమించుకుంది. దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డి సొంతగా ఆనందయ్య మందు తయారు చేయిస్తున్నారు.

ఆదివారం ఆనందయ్య మందు తయారీని చెవిరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అయితే కేవలం ఒకేరకం మందు ఇక్కడ తయారవుతోంది. కరోనా రాకుండా, శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచే విధంగా, బ్లాక్ ఫంగస్ వంటి వాటిని నియంత్రించే ప్రివెంటివ్(పి)ను మాత్రమే ఇక్కడ తయారు చేస్తున్నారు. తన నియోజక వర్గంలోని 1600 గ్రామాల్లోని 5.20 లక్షల మంది ప్రజలకు ఉచితంగా అనందయ్య మందు అందిస్తానంటున్నారు చెవిరెడ్డి.

ఇప్పటికే చాలామంది నాయకులు తమ నియోజకవర్గాల్లో పంచి పెట్టేందుకు పెద్ద ఎత్తున మందు తయారు చేయడానికి ఆనందయ్యకు ఆర్డర్ ఇచ్చి పెట్టారు. మందు తయారీకి కావాల్సిన పదార్థాల సేకరణ, ఇతర ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వీరంతా కృష్ణపట్నం నుంచి మందు తీసుకెళ్లాలనుకుంటున్నారు. అయితే డిమాండ్ ఎక్కువగా ఉండటంతో.. ఎమ్మెల్యే చెవిరెడ్డి, ఆనందయ్య శిష్యబృందంతో తిరుపతిలో రెండో బ్రాంచ్ ప్రారంభించారు.

Tags:    
Advertisement

Similar News