కరోనా విజేతల ఆత్మవిశ్వాసం పెంచే పరిశోధన ఇది..

కరోనా వైరస్ శరీరంలో ప్రవేశించిన విషయం కూడా తెలియకుండా చాలామందికి తగ్గిపోతుంది. మరికొంతమందిలో జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో కాస్త ఇబ్బంది పెడుతుంది. అతి తక్కువమంది మాత్రమే ప్రాణాపాయంలో పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ సోకనివారి కంటే.. వైరస్ సోకి కోలుకున్నవారే అదృష్టవంతులు అని చెబుతున్నారు నిపుణులు. కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో ఏకంగా 10నెలలపాటు యాంటీబాడీలు ఉండిపోతాయని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ (యూసీఎల్‌) శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలో తేలింది. ‘ద లాన్సెట్‌ హెల్దీ లాంగెవిటీ’ […]

Advertisement
Update:2021-06-05 02:13 IST

కరోనా వైరస్ శరీరంలో ప్రవేశించిన విషయం కూడా తెలియకుండా చాలామందికి తగ్గిపోతుంది. మరికొంతమందిలో జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలతో కాస్త ఇబ్బంది పెడుతుంది. అతి తక్కువమంది మాత్రమే ప్రాణాపాయంలో పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ సోకనివారి కంటే.. వైరస్ సోకి కోలుకున్నవారే అదృష్టవంతులు అని చెబుతున్నారు నిపుణులు. కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో ఏకంగా 10నెలలపాటు యాంటీబాడీలు ఉండిపోతాయని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ (యూసీఎల్‌) శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలో తేలింది. ‘ద లాన్సెట్‌ హెల్దీ లాంగెవిటీ’ జర్నల్‌ లో ఈ పరిశోధనా కథనాన్ని ప్రచురించారు.

కరోనా వ్యాక్సిన్ సమర్థత ఎంత అనేదానిపై ఇప్పటి వరకూ రకరకాల భిన్నాభిప్రాయాలున్నాయి. వ్యాక్సిన్ ఎంతకాలం పనిచేస్తుందనే విషయంపై కూడా ఎవరికీ స్పష్టత లేదు. అసలు టీకాతో యాంటీబాడీస్ పెరగడంలేదనే వాదన కూడా ఉంది. టీకా తీసుకున్నవారికి యాంటీబాడీస్ టెస్ట్ లో ఫలితం కనిపించడంలేదని తేలుతోంది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా బారినపడి చనిపోయినవారూ ఉన్నారు. అయితే ఒకసారి కరోనా నుంచి కోలుకుని, రెండోసారి దాని బారినపడినవారి సంఖ్య మాత్రం చాలా అరుదు. ఇదే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా యూసీఎల్ శాస్త్రవేత్తలుచేసిన పరిశోధన కరోనానుంచి కోలుకున్నవారి ఆత్మవిశ్వాసాన్నిమరింత పెంచుతోంది. మొత్తం 2111మందిపై ఈ అధ్యయనం జరగగా.. వీరిలో 634మంది గతంలో కోవిడ్ బారినపడి కోలుకున్నవారిని తీసుకున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్నవారిలో కేవలం 14మంది మాత్రమే రెండోసారి వైరస్ బారిన పడ్డారు. అసలు కరోనా సోకనివారిలో.. 204మంది పరిశోధన సమయంలో ఇన్ఫెక్షన్ కి గురయ్యారు. కరోనా విజేతల్లో రీఇన్ఫెక్షన్ ముప్పు దాదాపుగా 85శాతం ఉండదని ఈ పరిశోధన తెలియజేస్తోంది.

కరోనా వచ్చిందనే భయాన్ని వదిలేసి, సరైన చికిత్స, పోషకాహారం తీసుకుంటూ దాన్ని జయిస్తే.. దాదాపుగా ఏడాదిపాటు అది మనజోలికి రాలేదని ఈ అధ్యయనం చెబుతోంది. అంటే వ్యాక్సిన్ వేసుకున్నవారికంటే, కరోనా విజేతలకే దాన్ని తరిమికొట్టే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందనమాట. అంటే ఇకపై విదేశీ ప్రయాణాల అనుమతుల విషయంలో వ్యాక్సినేషన్ అయిందా అనే ప్రశ్నకంటే.. కరోనా వచ్చి తగ్గిందా అనే ప్రశ్నకే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది.

Tags:    
Advertisement

Similar News