మరోసారి కొరటాల చేతులు కట్టేశారా?

కెరీర్ లో ఎప్పుడూ ఇంత గ్యాప్ చూడలేదు కొరటాల. మామూలుగా కరోనా వల్ల అందరికీ గ్యాప్ వస్తే, కొరటాలకు కరోనా కంటే ముందే గ్యాప్ వచ్చింది. అలా రెండేళ్లకు పైగా తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాడు ఈ దర్శకుడు. ఇప్పుడీ డైరక్టర్ కు మరోసారి చేతులు కట్టేసినట్టున్నారు. ఆచార్య సినిమాకు సంబంధించి కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే ఉంది. ఆ 20 రోజుల షూటింగ్ అయిపోతే, ఆయన ఎన్టీఆర్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టుకోవచ్చు. […]

Advertisement
Update:2021-06-05 14:10 IST

కెరీర్ లో ఎప్పుడూ ఇంత గ్యాప్ చూడలేదు కొరటాల. మామూలుగా కరోనా వల్ల అందరికీ గ్యాప్ వస్తే,
కొరటాలకు కరోనా కంటే ముందే గ్యాప్ వచ్చింది. అలా రెండేళ్లకు పైగా తన సినిమాతో ప్రేక్షకుల
ముందుకు రాలేకపోయాడు ఈ దర్శకుడు. ఇప్పుడీ డైరక్టర్ కు మరోసారి చేతులు కట్టేసినట్టున్నారు.

ఆచార్య సినిమాకు సంబంధించి కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే ఉంది. ఆ 20 రోజుల షూటింగ్
అయిపోతే, ఆయన ఎన్టీఆర్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టుకోవచ్చు. కానీ ఆచార్య యూనిట్
మాత్రం కొరటాలకు ఆ అవకాశం లేకుండా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పట్లో షూటింగ్ మొదలుపెట్టే
ఆలోచన చేయడం లేదు చిరంజీవి.

కాంట్రాక్ట్ ప్రకారం ఆచార్య పూర్తయితే తప్ప ఎన్టీఆర్ సినిమాపైకి వెళ్లలేడు కొరటాల. దీనికితోడు ఎన్టీఆర్ కు
ఆర్ఆర్ఆర్ కాంట్రాక్ట్ ఉండనే ఉంది. అది పూర్తయితే తప్ప మరో సినిమా స్టార్ట్ చేయలేడు. ఇలా తనకు
సంబంధం లేకుండానే, తన చేతులు కట్టేసినట్టు ఫీలవుతున్నాడు కొరటాల.

Tags:    
Advertisement

Similar News