రామ్ చరణ్, రవితేజ సినిమా
రామ్ చరణ్, రవితేజ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. అయితే ఇది మల్టీస్టారర్ మూవీ మాత్రం కాదు. సినిమాలో రవితేజ హీరో, రామ్ చరణ్ నిర్మాత అన్నమాట. ఈ మేరకు సంప్రదింపులు, చర్చలు పూర్తయ్యాయి. అధికారిక ప్రకటన మాత్రమే పెండింగ్. మలయాళంలో సూపర్ హిట్టయిన డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమా తెలుగు రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు రామ్ చరణ్. ఆ సినిమా చరణ్ కు బాగా నచ్చింది. అందుకే వెంటనే హక్కులు తీసుకున్నాడు. ఆ కథకు రవితేజ […]
రామ్ చరణ్, రవితేజ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. అయితే ఇది మల్టీస్టారర్ మూవీ మాత్రం కాదు.
సినిమాలో రవితేజ హీరో, రామ్ చరణ్ నిర్మాత అన్నమాట. ఈ మేరకు సంప్రదింపులు, చర్చలు
పూర్తయ్యాయి. అధికారిక ప్రకటన మాత్రమే పెండింగ్.
మలయాళంలో సూపర్ హిట్టయిన డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమా తెలుగు రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు
రామ్ చరణ్. ఆ సినిమా చరణ్ కు బాగా నచ్చింది. అందుకే వెంటనే హక్కులు తీసుకున్నాడు. ఆ కథకు
రవితేజ అయితే బాగుంటుందనేది చరణ్ ఫీలింగ్. సినిమా చూసిన వెంటనే రవితేజ కూడా ఓకే
చెప్పేశాడు.
అలా డ్రైవింగ్ లైసెన్స్ తెలుగు రీమేక్ ఫిక్స్ అయింది. అయితే ఇందులో మరో కీలక పాత్ర కూడా ఉంది.
దాదాపు హీరోతో సమానమైన పాత్ర అది. ఆ క్యారెక్టర్ కోసం ఎవర్ని లాక్ చేస్తారో చూడాలి. మొన్నటివరకు
వెంకటేష్ పేరు వినిపించింది. ఫైనల్ గా ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్.