వ్యాయామం ఏ టైంలో చేస్తే మంచిదంటే..

వ్యాయామం ఏ సమయంలో చేయాలన్న విషయంపై చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి.

Advertisement
Update:2023-01-05 12:17 IST

వ్యాయామం ఏ టైంలో చేస్తే మంచిదంటే..

వ్యాయామం ఏ సమయంలో చేయాలన్న విషయంపై చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. అయితే వ్యాయామానికి దాన్ని చేసే సమయానికి ఏదైనా సంబంధం ఉందా అన్న విషయంపై ఇటీవల జరిగిన ఓ కొత్త అధ్యయనంలో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటకొచ్చాయి. అవేంటంటే..

వ్యాయామం చేసే సమయాన్ని బట్టి దాని ప్రభావం ఉంటుందని, అలాగే వ్యాయామం చేసే సమయాన్ని బట్టి మెటబాలిజం కూడా మారుతుందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ స్టడీ ప్రకారం మెటబాలిజం పెరగాలంటే ఉదయం వ్యాయామం కంటే సాయంత్రం వ్యాయామం ఎక్కువ శక్తివంతమైనది అని తేలింది. ఎక్కువ బరువు ఉంటూ రోజూ ఫ్యాట్ ఫుడ్ తీసుకునే కొందరు పురుషులపై చేసిన ఈ స్టడీలో.. సాయంత్రం వ్యాయామం వల్లనే ఎంతో ఉపయోగముందని తేలింది.

చాలామందికి తెలియని విషయమేంటంటే శరీరంలోని కణాలన్నీ సిర్కాడియన్ షెడ్యూల్‌ను అనుసరిస్తాయి. అంటే భూమిపై కాంతి లేని సమయంలో అంటే రాత్రివేళల్లోనే మనకు మంచి నిద్ర అందుతుంది. శరీరంలోని అణువులన్నీ ఇలా ఓ టైం టేబుల్ ని ఫాలో అవుతాయి. శరీరంలోని కణజాలాలలో జీవ వ్యవస్థలను సమన్వయం చేసే పరమాణు గడియారాలు ఉంటాయి. దీన్ని బట్టే మనకు ఆకలి వేయడం, శరీర ఉష్ణోగ్రతలు మారడం, నిద్ర పట్టడం ఇలా అన్నిరకాల పనులు జరుగుతుంటాయి. అచ్చం ఇలాగే కండరాల పనితీరు కొవ్వు కరిగే రేటు.. వీటికి కూడా ఓ అనువైన సమయం ఉంటుంది. అది మన రోజువారీ లైఫ్ స్టైల్ ను బట్టి మారుతూ ఉంటుది. అయితే ఇప్పుడున్న మోడ్రన్ లైఫ్ స్టైల్ కు ఉదయం వ్యాయామం కంటే సాయంత్రపు వ్యాయామం మంచిదని నిపుణులు తేల్చారు.

అధిక బరువు, షుగర్ ఉండే వాళ్లు, కొవ్వు పదార్థాలు తీసుకునే వారికి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు చేసే వ్యాయామం కంటే సాయంత్రం చేసే వ్యాయామమే మెటబాలిజం పెరిగేందుకు సరిగ్గా సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. పరగడుపున చేసే వ్యాయామం వల్ల రక్తంలో చక్కెర స్థాయిల్లో మార్పులొస్తాయని, అది షుగర్ కంట్రోల్ కు అంత అనువైంది కాదని నిపుణులు చెప్తున్నారు.

ఎంతోమంది వలంటీర్లపై రకరకాల స్టడీలు చేసి కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర నియంత్రణ, మెటబాలిజం లాంటి అంశాల్లో వ్యాయామం చేసే సమయం ఎలా పనిచేస్తుందో గమనించారు. పరగడుపున వ్యాయామం కంటే శరీరం ఆహారం తీసుకోవడం మొదలైన తర్వాత చేసే వ్యాయామాలు మంచి ఫలితాలనిస్తాయని వారు చేసిన స్టడీలో వెల్లడైంది.

Tags:    
Advertisement

Similar News