పిల్లి శాపాలకు ఉట్లు తెగవు బాబూ.. -విజయసాయి
ఇంకా మూడేళ్లే మిగిలున్నాయి. ఆ తర్వాత అధికారం మనదే తమ్ముళ్లూ అంటూ చంద్రబాబు మహానాడులో కార్యకర్తలను భ్రమల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, పిల్లి శాపాలకు ఉట్లు తెగే ప్రసక్తే లేదని మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 2024 ఎన్నికలగురించి ఇప్పుడే చంద్రబాబు జోస్యం చెబుతున్నారని, మూడేళ్ల తర్వాత అసలు టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోవాలని హితవు పలికారు. “మూడేళ్ల తర్వాత జగన్ వెంట ఎవరూ మిగలరని శోకాలు పెడుతున్నావు. అచ్చెన్న సహా సీనియర్లందరికీ భవిష్యత్తు అర్థమవుతోంది, […]
ఇంకా మూడేళ్లే మిగిలున్నాయి. ఆ తర్వాత అధికారం మనదే తమ్ముళ్లూ అంటూ చంద్రబాబు మహానాడులో కార్యకర్తలను భ్రమల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని, పిల్లి శాపాలకు ఉట్లు తెగే ప్రసక్తే లేదని మండిపడ్డారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 2024 ఎన్నికలగురించి ఇప్పుడే చంద్రబాబు జోస్యం చెబుతున్నారని, మూడేళ్ల తర్వాత అసలు టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుందో చూసుకోవాలని హితవు పలికారు. “మూడేళ్ల తర్వాత జగన్ వెంట ఎవరూ మిగలరని శోకాలు పెడుతున్నావు. అచ్చెన్న సహా సీనియర్లందరికీ భవిష్యత్తు అర్థమవుతోంది, భ్రమలనుంచి బయటపడు” అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.
పప్పువండారో లేదో తెలుసుకోడానికి లోకేష్ కి బాధ్యతలా..?
“గతంలో పోలింగ్ బూత్ ల వారీగా కమిటీలున్న పార్టీ తమదొక్కటే అని గొప్పలకు పోయాడు బాబు. అయినా వరస ఎన్నికల్లో చిత్తయ్యాడు. ఇప్పుడు 50 ఇళ్లకో కార్యకర్తను నియమిస్తాడట. జన్మభూమి ముసుగులో పచ్చ బ్యాచ్ సాగించిన అరాచకాలను ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు.” అని అన్నారు విజయసాయిరెడ్డి. కార్యకర్తలందరిపై లోకేష్ పర్యవేక్షణ ఉంటుందని చెప్పడం మరీ విడ్డూరమని, అలా చేస్తే ఏ ఇంట్లో పప్పు వండారో తెలుసుకోవడమే లోకేష్ పనిగా పెట్టుకుంటారని ఎద్దేవా చేశారు.
” ‘యూ టర్నుల’ బాబు ప్రత్యేక హోదా కోసం నిస్సిగ్గుగా మళ్లీ తీర్మానం చేయించాడు. అప్పట్లో ప్యాకేజే ముద్దు అని కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన సంగతి ఎవరూ మర్చిపోలేదు. నా దగ్గర చిప్ప మాత్రమే ఉంది. డబ్బు ఉంటే నీకో లక్ష ఇచ్చే వాడిని అనే తుపాకి రాముడి కామెడీ గుర్తొస్తోంది.” అంటూ వరుస ట్వీట్లతో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు విజయసాయి రెడ్డి.
స్వయంప్రకటిత మేథావులు, బాబాల వద్ద నేర్చుకున్న విద్యలన్నిటినీ ఇప్పుడు చంద్రబాబు కార్యకర్తల ముందు ప్రదర్శిస్తున్నారని, తమ బండారం బయటపడగానే పారిపోయే ఫేక్ బాబాల్లాగా.. చంద్రబాబు ఇప్పుడు కార్యకర్తల ముందు పెద్ద జోకర్ లా మారిపోయారని విమర్శించారు విజయసాయిరెడ్డి.