పప్పు నాయుడు, తుప్పు నాయుడు.. " కొడాలి చాకిరేవు..

ఇటీవల కాలంలో ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలకు కాస్త విరామం ఇచ్చిన మంత్రి కొడాలి నాని, వైసీపీ రెండేళ్ల పాలన సందర్భంగా మరోసారి చంద్రబాబు, లోకేష్ కి చాకిరేవు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూనే, ప్రతిపక్షంగా టీడీపీ విఫలం అయిందని, చంద్రబాబు, లోకేష్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ రెండేళ్ల పాలన చూసిన తర్వాత.. 2014లో చంద్రబాబుకి అధికారం ఇచ్చి తప్పుచేశామని, అప్పుడే జగన్ కి అధికారం అప్పగించి ఉంటే బాగుండేదని […]

Advertisement
Update:2021-05-30 15:18 IST

ఇటీవల కాలంలో ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలకు కాస్త విరామం ఇచ్చిన మంత్రి కొడాలి నాని, వైసీపీ రెండేళ్ల పాలన సందర్భంగా మరోసారి చంద్రబాబు, లోకేష్ కి చాకిరేవు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూనే, ప్రతిపక్షంగా టీడీపీ విఫలం అయిందని, చంద్రబాబు, లోకేష్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం జగన్ రెండేళ్ల పాలన చూసిన తర్వాత.. 2014లో చంద్రబాబుకి అధికారం ఇచ్చి తప్పుచేశామని, అప్పుడే జగన్ కి అధికారం అప్పగించి ఉంటే బాగుండేదని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు నాని.

వైఎస్ఆర్ అలా.. జగన్ ఇలా..
2004, 2009లో వైఎస్ఆర్ చంద్రబాబుని తుక్కుతుక్కుగా ఓడించారని గుర్తు చేశారు నాని. వైఎస్ఆర్, చంద్రబాబుకి కనీసం అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశమైనా ఇచ్చారని, కానీ జగన్ మాత్రం చంద్రబాబు కొడుకు లోకేష్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనీయకుండా ఓడించారని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి చంద్రబాబు అని, ప్రజల మద్దతుతో నేరుగా సీఎం అయిన వ్యక్తి జగన్ అని అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రతి పేదవాడికి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలు అందిస్తుంటే చూసి ఓర్వలేక, పక్కరాష్ట్రం నుంచి జూమ్ ద్వారా చంద్రబాబు, లోకేష్ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పప్పునాయుడు, తుప్పునాయుడు అంటూ.. తండ్రీకొడుకులపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్టీఆర్ కి భారతరత్న రాకుండా అడ్డుపడింది చంద్రబాబేనని అన్నారు మంత్రి నాని.

బాబుకి అధికారం ఎప్పటికీ దక్కదు..
దేశంలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా కూడా చంద్రబాబుకి అధికారం దక్కదని విమర్శించారు మంత్రి నాని. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని పప్పునాయుడు, మళ్లీ అధికారంలోకి వస్తాడా అని ప్రశ్నించారు. సీఎం జగన్ కి ప్రజలు, దేవుడి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని, చంద్రబాబు, లోకేష్‌ బతికుండగా సీఎం జగన్‌ ను అధికారం నుంచి దించలేరని చెప్పారు.

Tags:    
Advertisement

Similar News