ఉల్లిపాయలతో బ్లాక్ ఫంగస్.. ఇదెక్కడి గందరగోళం..

కరోనా వచ్చిన తొలినాళ్లలో.. కొవిడ్ వైరస్ గురించి సోషల్ మీడియా అంతా అర్థ సత్యాలు, అసత్యాలతో నిండిపోయేది. కొవిడ్ గురించి ఎవరికీ పెద్దగా అవగాహన లేకపోవడంతో.. తప్పుడు ప్రచారం జోరుగా సాగింది. గతంలో కొవిడ్ పేషెంట్ అనగానే వైద్యులు కూడా భయపడి అల్లంత దూరంలో ఉండిపోయేవారు. సెకండ్ ఫేజ్ వచ్చే సమయానికి ధైర్యంగా నాడిపట్టి వైద్యం చేస్తున్నారు. మృతదేహాల విషయంలో కూడా అప్పుడున్నంత భయం ఇప్పుడు లేదు. అయితే ఇప్పుడా స్థానాన్ని బ్లాక్ ఫంగస్ భర్తీ చేస్తోంది. […]

Advertisement
Update:2021-05-28 02:29 IST

కరోనా వచ్చిన తొలినాళ్లలో.. కొవిడ్ వైరస్ గురించి సోషల్ మీడియా అంతా అర్థ సత్యాలు, అసత్యాలతో నిండిపోయేది. కొవిడ్ గురించి ఎవరికీ పెద్దగా అవగాహన లేకపోవడంతో.. తప్పుడు ప్రచారం జోరుగా సాగింది. గతంలో కొవిడ్ పేషెంట్ అనగానే వైద్యులు కూడా భయపడి అల్లంత దూరంలో ఉండిపోయేవారు. సెకండ్ ఫేజ్ వచ్చే సమయానికి ధైర్యంగా నాడిపట్టి వైద్యం చేస్తున్నారు. మృతదేహాల విషయంలో కూడా అప్పుడున్నంత భయం ఇప్పుడు లేదు. అయితే ఇప్పుడా స్థానాన్ని బ్లాక్ ఫంగస్ భర్తీ చేస్తోంది. గతంలో కొవిడ్ గురించి జరిగిన తప్పుడు ప్రచారమంతా.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ విషయంలో రిపీట్ అవుతోంది.

ఉల్లిపాయలతో బ్లాక్ ఫంగస్..
ఉల్లిపాయలు నిల్వ ఉంటే.. వాటి పొరలపై నల్లటి పదార్థం పేరుకుపోతుంది. దానికి, బ్లాక్ ఫంగస్ ని ముడిపెట్టి తప్పుడు ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ నల్లటి పదార్థమే బ్లాక్ ఫంగస్ కి మూలకారణం అని, ఉల్లిపాయలతో కూరలు వండేటప్పుడు జాగ్రత్త అనే మెసేజ్ చక్కర్లు కొడుతోంది. పదే పదే ఇలాంటి మెసేజ్ లు ఫార్వార్డ్ కావడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. ఉల్లిపాయల పొరల్లో నల్లటి పదార్థం కనపడితే వెంటనే వాటిని దూరంగా ఉంచాలని, పడేయాలని కొంతమంది సలహాలిస్తున్నారు.

ఫ్రిడ్జ్ తో బ్లాక్ ఫంగస్..
ఫ్రిడ్జ్ అనేది అందరి ఇళ్లలోనూ కనిపించే నిత్యావసరం. అది లేకుండా పనిజరగడం కష్టం. అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్ వాడకం బ్లాక్ ఫంగస్ కి దారితీస్తుందనే పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఫ్రిడ్జ్ లో నల్లగా కనిపించే బ్యాక్టీరియా.. బ్లాక్ ఫంగస్ కి కారణం అవుతుందని, నీళ్ల బాటిళ్లు, కూరలు పెట్టే దగ్గర నల్లగా తయారైతే వెంటనే శుభ్రం చేసుకోవాలని కొంతమంది ప్రచారం మొదలు పెట్టారు. ఫ్రిడ్జ్ లో కూలింగ్ కోసం ఉపయోగించే గ్యాస్ వల్ల కూడా ఆ వ్యాధి వస్తుందని ఓ మైక్రోబయాలజీ ప్రొఫెసర్ చెప్పినట్టు వార్తలొచ్చాయి. ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్ శుభ్రం చేసుకోవాలని, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తినకూడదని, ఫ్రిడ్జ్ లోపలి భాగం నల్లగా అయితే, బ్లాక్ ఫంగస్ కారక సూక్ష్మజీవులు దాడి చేయడానికి సిద్ధమైనట్టేనని రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.

ఎయిమ్స్ డైరెక్టర్ ఖండన..
అయితే ఇదంతా తప్పుడు ప్రచారమని ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. కూరగాయలు, వస్తువుల ద్వారా బ్లాక్‌ ఫంగస్‌ రాదని ఆయన స్పష్టం చేశారు. ఉల్లిపాయలపై కనిపించే నల్లని పొర భూమిలో ఉండే ఫంగస్‌ వల్ల ఏర్పడుతుందని, అది బ్లాక్‌ ఫంగస్‌ కు దారి తీయదని స్పష్టం చేశారు. కరోనా రాకముందు కూడా బ్లాక్ ఫంగస్ ఉందని, లక్షలో కేవలం 14మందిలోని ఇలాంటి లక్షణాలు కనిపించేవని.. తప్పుడు ప్రచారం నమ్మొద్దని ఆయన తెలిపారు.

Tags:    
Advertisement

Similar News