కోవిడ్ తర్వాత లంగ్స్ సేఫేనా?

వైరస్‌లు ఎన్నీ మ్యూటెంట్ లు వచ్చినా చివరికి అన్నిరకాల వైరస్ లు అటాక్ చేసేది ఊపిరితిత్తులపైనా అని ఆక్స్ ఫర్స్ సైంటిస్టుల స్టడీలో తేలింది. కోవిడ్ నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత వరకూ ఊపిరితిత్తులు దెబ్బతినే ఉంటాయని వారంటున్నారు. యూకేలోని షెఫీల్డ్‌ యూనివర్సిటీ, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకుల సంయుక్త అధ్యయనంలో ఊపిరితిత్తులపై కోవిడ్ ఎంతగా ప్రభావం చూపుతుందో తేలింది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా.. మూడు నుంచి తొమ్మిది నెలల వరకూ.. ఊపిరితిత్తులు దెబ్బతినే […]

Advertisement
Update:2021-05-27 07:58 IST

వైరస్‌లు ఎన్నీ మ్యూటెంట్ లు వచ్చినా చివరికి అన్నిరకాల వైరస్ లు అటాక్ చేసేది ఊపిరితిత్తులపైనా అని ఆక్స్ ఫర్స్ సైంటిస్టుల స్టడీలో తేలింది. కోవిడ్ నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాత వరకూ ఊపిరితిత్తులు దెబ్బతినే ఉంటాయని వారంటున్నారు.

యూకేలోని షెఫీల్డ్‌ యూనివర్సిటీ, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకుల సంయుక్త అధ్యయనంలో ఊపిరితిత్తులపై కోవిడ్ ఎంతగా ప్రభావం చూపుతుందో తేలింది.

కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా.. మూడు నుంచి తొమ్మిది నెలల వరకూ.. ఊపిరితిత్తులు దెబ్బతినే ఉంటాయని స్టడీలో వెల్లడైంది. అంటే కోవిడ్ నుంచి కోలుకున్నాక కూడా మూడు నాలుగు నెలల వరకూ జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలని వారు సూచిస్తున్నారు. అయితే కరోనా తర్వాత ఊపిరితిత్తులకు కొనసాగుతున్న నష్టాన్ని సాధారణ సీటీ స్కాన్, క్లినికల్‌ పరీక్షల ద్వారా గుర్తించలేమని చెప్తు్న్నారు.

ఇమేజింగ్ అనే కొత్త టెక్నాలజీని ఉపయోగించి ఆక్స్ ఫర్డ్ సైంటిస్టులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు.
కోవిడ్ తర్వాత ఊపిరితిత్తుల్లో ఏదైనా సమస్యగా ఉంటే వారు ఇంకా కోలుకోనట్లేనని, ఊపిరితిత్తుల్లో కనపించకుండా జరుగుతున్న నష్టాన్ని హైపర్‌పోలరైజ్డ్‌ జినాన్‌ ఎంఆర్‌ఐ (జిఎంఆర్‌ఐ) పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చని వారు సూచించారు.

Tags:    
Advertisement

Similar News