థర్డ్ వేవ్ లో పిల్లలు సేఫేనా?
కరోనా మొదటి వేవ్ లో పిల్లలు దాదాపు సేఫ్ గానే ఉన్నారు. అయితే రెండో వేవ్‌లో సీన్ మారింది. పిల్లలు కూడా ఓ మోస్తరు సంఖ్యలో వైరస్ బారిన పడ్డారు. ఇకపోతే మూడో వేవ్ అచ్చంగా పిల్లలకే ఎఫెక్ట్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగా మూడో వేవ్ వస్తే.. పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడ్డ పిల్లల సంఖ్య బాగానే ఉంది. కర్ణాటకలో దాదాపు 40 వేల మంది పిల్లలు […]
కరోనా మొదటి వేవ్ లో పిల్లలు దాదాపు సేఫ్ గానే ఉన్నారు. అయితే రెండో వేవ్‌లో సీన్ మారింది. పిల్లలు కూడా ఓ మోస్తరు సంఖ్యలో వైరస్ బారిన పడ్డారు. ఇకపోతే మూడో వేవ్ అచ్చంగా పిల్లలకే ఎఫెక్ట్ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగా మూడో వేవ్ వస్తే.. పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి?
సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడ్డ పిల్లల సంఖ్య బాగానే ఉంది. కర్ణాటకలో దాదాపు 40 వేల మంది పిల్లలు ఈ వైరస్ బారిన పడ్డారు. రాజస్థాన్‌లో కూడా దాదాపు వెయ్యికి పైగా కేసులొచ్చాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. ప్రతీ వేవ్ లో.. అందరితో పాటే పిల్లలకూ వైరస్ సోకుతూనే ఉంటుంది. అయితే పిల్లల్లో ఉండే హై ఇమ్యూనిటీ కారణంగా వారికి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం, ఎలాంటి ఇబ్బందీ తలెత్తకపోవడం వల్ల పిల్లలకు టెస్ట్ లు చేయడం జాగ్రత్తలు తీసుకోవడం అంతగా లేదు. అయితే సెకండ్ వేవ్ లో వైరస్ తో ఇబ్బంది పడుతున్న కేసులు కూడా చూస్తున్నాం. అంటే మారుతున్న వైరస్ మ్యూటేషన్ ను బట్టి పిల్లలపై దాని ఎఫెక్ట్ కూడా మారుతోంది. ఈ అంచనాతోనే మూడో వేవ్ లో పిల్లలకు ఎక్కువ ఎఫెక్ట్ ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి అదే జరిగితే మనదేశం దానిని ఎదుర్కోగలదా అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్.
పిల్లలు వైరస్ బారిన పడి ఇబ్బంది పడితే.. వారికి ఇవ్వాల్సిన ట్రీట్ మెంట్ అలాగే హాస్పిటల్స్ లో వారికోసం చేయాల్సిన ఏర్పాట్లు పూర్తిగా వేరేలా ఉంటాయి. పిల్లల కోసం పీడియాట్రిక్ వెంటిలేటర్లు కావాలి. కానీ మన దేశంలో పీడియాట్రిక్ వెంటిలేటర్లు తయారు చేసే సంస్థలు కేవలం పదుల సంఖ్యలో ఉన్నాయి. కరోనా మూడోవేవ్ లో పిల్లల్ని రక్షించాలంటే ‘పీడియాట్రిక్ ఇన్‌ఫ్రా’ అనే చైల్డ్ స్పెషలైజ్డ్ ట్రీట్ మెంట్ ను అలాగే వసతులను రెడీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దీనికోసం ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు రెడీ అవుతున్నాయి.
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం మూడో వేవ్‌లో పిల్లలను కాపాడుకోవడానికి ఇప్పటికే ప్రణాళికలు చేస్తోంది. దీనికై ఓ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. పిల్లల చికిత్సకు అవసరమైనన్ని పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఔషధాలను సమకూర్చుకునే పనిలో పడింది. అలాగే కర్ణాటక ప్రభుత్వం కూడా పీడియాట్రిక్ కొవిడ్ కేర్ సెంటర్లను, అనాథ పిల్లల కోసం రీహాబిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది.
మరోపక్క అమెరికాలో ఇప్పటికే కోవిడ్ బారిన పడిన పిల్లల సంఖ్య దాదాపు 35 లక్షలుగా ఉంది. 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో 35 లక్షల పిల్లలు కోవిడ్ బారిన పడితే 130 కోట్ల జనాభా ఉన్న మనదేశంలో ఆ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.