ఏసీ ఎక్కువగా వాడుతున్నారా?

అసలే ఇది ఎండాకాలం. పైగా లాక్ డౌన్.. అందుకే ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో ఉంటే ఏసీ ని వాడడం తప్పని సరి. ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని వారు చాలామంది ఉంటారు. అయితే ఏసీని అతిగా వాడడం వల్ల చాలా నష్టాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే.. పొడిబారే కళ్లు: మొబైల్, టీవీ స్క్రీన్స్ కు అతుక్కుపోయే చాలామందికి కళ్లు పొడిబారుతూ ఉంటాయి. అయితే ఏసీ ఎప్పుడూ ఆన్ లో ఉండడం వల్ల కళ్లలో […]

Advertisement
Update:2021-05-22 09:06 IST

అసలే ఇది ఎండాకాలం. పైగా లాక్ డౌన్.. అందుకే ఇప్పుడు అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో ఉంటే ఏసీ ని వాడడం తప్పని సరి. ఏసీ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేని వారు చాలామంది ఉంటారు. అయితే ఏసీని అతిగా వాడడం వల్ల చాలా నష్టాలున్నాయంటున్నారు నిపుణులు. అవేంటంటే..

పొడిబారే కళ్లు: మొబైల్, టీవీ స్క్రీన్స్ కు అతుక్కుపోయే చాలామందికి కళ్లు పొడిబారుతూ ఉంటాయి. అయితే ఏసీ ఎప్పుడూ ఆన్ లో ఉండడం వల్ల కళ్లలో మంట, దురద లాంటివి ఎక్కువవుతాయి.

తక్కువ ఆక్సిజన్ : ఏసీ ఆన్ లో ఉంటే కిటకీలు తలుపులు మూసేయాల్సి వస్తుంది. దాంతో ఇంట్లో వెంటిలేషన్ సరిగా ఉండదు. అసలే ఈ టైంలో వెంటిలేషన్ చాలా ముఖ్యం. ఇంటి గదిలో ఆక్సిజన్ తగ్గితే తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ.

ఇవి కూడా
ఇక వీటితో పాటు ఏసీలో ఎక్కువ సేపు ఉంటే లోబీపీ వచ్చే అవకాశం కూడా ఉంది. ఎక్కువసేపు ఏసీలో ఉండటం వల్ల బ్లడ్‌లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోయి బాడీ త్వరగా అలిసిపోవచ్చు కూడా.
ఏసీ ఎక్కువ సేపు ఉంటే చల్లదనం వల్ల బాడీ డీహైడ్రేషన్ కు గురవుతుంది. దీంతో ఎక్కువగా నీరు తాగాల్సి వస్తుంది. అలా తాగకపోతే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది.
ఏసీ ఎక్కువగా వాడడం వల్ల ముక్కు దిబ్బడ, అలర్జీస్, చర్మ సమస్యలు కూడా రావొచ్చు.

Tags:    
Advertisement

Similar News