నాని సినిమాకు రూ.2 కోట్లు నష్టం

విడుద లకు ముందే నాని సినిమాకు 2 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వెంకట్ బోయనపల్లి నిర్మాతగా శ్యామ్ సింగరావు అనే సినిమా చేస్తున్నాడు నాని. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ వేశారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరక్షన్ లో 10 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ సెట్ వేశారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. అంతలోనే కరోనా […]

Advertisement
Update:2021-05-22 13:27 IST

విడుద లకు ముందే నాని సినిమాకు 2 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. వెంకట్ బోయనపల్లి నిర్మాతగా
శ్యామ్ సింగరావు అనే సినిమా చేస్తున్నాడు నాని. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా
కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ వేశారు.

అవినాష్ కొల్ల ఆర్ట్ డైరక్షన్ లో 10 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ
సెట్ వేశారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా చేశారు. అంతలోనే కరోనా కేసులు పెరగడంతో షూటింగ్
ఆపేశారు. కేసులు తగ్గిన తర్వాత తిరిగి షూటింగ్ మొదలుపెట్టాలని అనుకున్నారు.

కానీ ఊహించని విధంగా ఈమధ్య హైదరాబాద్ లో భారీ వర్షాలు పడ్డాయి. ఈ వర్షాలకు సెట్ లో కొంత
భాగం దెబ్బతింది. దాని విలువను తాజాగా 2 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. నష్టం సంగతి
అటుంచితే ఇప్పటికిప్పుడు ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ ప్రారంభించే అవకాశం లేకుండా పోయింది.

సెట్ కు రిపేర్లు పూర్తిచేస్తే తప్ప కొత్త షెడ్యూల్ మొదలవ్వదు. నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడొన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News