2.30 లక్షల కోట్ల ఏపీ బడ్జెట్..

2021-22 సంవత్సరానికిగాను ఏపీ ప్రభుత్వం రూ. 2,29,779.27 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. వ్యవసాయ బడ్జెట్ ను మరో మంత్రి కన్నబాబు ప్రవేశ పెట్టగా.. శాసన మండలిలో మంత్రులు మేకతోటి సుచరిత, ధర్మాన కృష్ణదాస్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనా 2,24,789.18 కోట్లు కాగా ఈ ఏడాది 2,29,779.27 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ఏపీ ప్రభుత్వం ఈ ఆర్థిక […]

Advertisement
Update:2021-05-20 10:29 IST

2021-22 సంవత్సరానికిగాను ఏపీ ప్రభుత్వం రూ. 2,29,779.27 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. వ్యవసాయ బడ్జెట్ ను మరో మంత్రి కన్నబాబు ప్రవేశ పెట్టగా.. శాసన మండలిలో మంత్రులు మేకతోటి సుచరిత, ధర్మాన కృష్ణదాస్ బడ్జెట్ ప్రవేశ పెట్టారు. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ అంచనా 2,24,789.18 కోట్లు కాగా ఈ ఏడాది 2,29,779.27 కోట్లతో బడ్జెట్ రూపొందించారు.

ఏపీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి తొలిసారి జెండర్ బేస్డ్ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. మహిళలు, చిన్నారులకు బడ్జెట్‌ లో ప్రాధాన్యత కల్పించింది. రూ.47,283 కోట్లతో జెండర్‌ బడ్జెట్‌ తెచ్చింది. ఈ మొత్తాన్ని మహిళల అభివృద్ధికి కేటాయిస్తారు. చిన్నారుల సంక్షేమం కోసం రూ. 16,748 కోట్లు కేటాయించారు.

కేటాయింపులు ఇలా..
– వ్యవసాయ పథకాలకు రూ.11,210 కోట్లు
– విద్యారంగానికి రూ.24,624 కోట్లు
– వైద్యం, ఆరోగ్యానికి రూ.13,830 కోట్లు
– వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక కోసం రూ.17 వేల కోట్లు

కొవిడ్ పై పోరుకి వెయ్యి కోట్లు..
ఏపీ ప్రభుత్వ తాజా బడ్జెట్ లో కరోనాపై యుద్ధానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించింది. మొత్తం ఆరోగ్య రంగానికి 13,840.44 కోట్ల రూపాయలు కేటాయించగా.. ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలు కోసం రూ.2,248.94 కోట్లు, ఆస్పత్రుల్లో నాడు-నేడు కార్యక్రమానికి రూ.1535 కోట్లు, ఆస్పత్రుల్లో శానిటేషన్‌కు రూ.100 కోట్లు, శ్రీకాకుళం జిల్లా పలాస ఆస్పత్రికి రూ.50 కోట్ల చెప్పున కేటాయింపులు జరిగాయి.

విద్యా రంగానికి దాదాపు పాతికవేల కోట్లు..
విద్యా రంగానికి రూ.24,624.22 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాలల్లో నాడు-నేడుకు రూ.3,500 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.1200 కోట్లు, జగనన్న విద్యాకానుకు కోసం రూ.750 కోట్లు, ఉన్నత విద్య కోసం రూ.1973 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికతోపాటు, బీసీ, బ్రాహ్మణ, కాపు సంక్షేమ పథకాలకు గతేడాది కంటే ఈ ఆర్థిక సంవత్సరం నిధులు ఎక్కువగా కేటాయించారు.

మరోవైపు బడ్జెట్ సమావేశాల్ని కేవలం ఒక్కరోజు మాత్రమే నిర్వహించడాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు నిరశిస్తూ అసెంబ్లీ సెషన్ ని బహిష్కరించారు.

Tags:    
Advertisement

Similar News