వ్యాక్సిన్ కోసం టూరేస్తున్నారు..

ట్రావెలింగ్ లో రకరకాలు ట్రెండ్ లు చూశాం. వాలంటూరిజం, వెల్ నెస్ టూరిజం.. ఇలా బోలెడ్ టూరిజం ట్రెండ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు కరోనా టైంలో మరో కొత్త ట్రావెల్ ట్రెండ్ మొదలైంది. అదే వ్యాక్సిన్ టూరిజం. ప్రస్తుతం చాలా దేశాల్లో వ్యాక్సిన్స్ అందుబాటులో లేవు. అందుకే ‘వ్యాక్సినేషన్’ కోసం ఇతర దేశాలకు వెళ్లే వాళ్ల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. దీన్నే ‘వ్యాక్సిన్ టూరిజం’ అంటున్నారు. కరోనా అంతగా లేని చాలా దేశాలు లాక్‌‌డౌన్ తర్వాత పర్యాటకులను […]

Advertisement
Update:2021-05-19 09:02 IST

ట్రావెలింగ్ లో రకరకాలు ట్రెండ్ లు చూశాం. వాలంటూరిజం, వెల్ నెస్ టూరిజం.. ఇలా బోలెడ్ టూరిజం ట్రెండ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు కరోనా టైంలో మరో కొత్త ట్రావెల్ ట్రెండ్ మొదలైంది. అదే వ్యాక్సిన్ టూరిజం.

ప్రస్తుతం చాలా దేశాల్లో వ్యాక్సిన్స్ అందుబాటులో లేవు. అందుకే ‘వ్యాక్సినేషన్’ కోసం ఇతర దేశాలకు వెళ్లే వాళ్ల సంఖ్య ఇప్పుడు పెరుగుతోంది. దీన్నే ‘వ్యాక్సిన్ టూరిజం’ అంటున్నారు. కరోనా అంతగా లేని చాలా దేశాలు లాక్‌‌డౌన్ తర్వాత పర్యాటకులను ఆహ్వానిస్తున్నాయి. ఈ సందర్భంగా కోవిడ్ వ్యాక్సిన్ టూరిజం తక్కువ కాలంలోనే పాపులర్ అయింది.

వ్యాక్సిన్ టూరిజం అంటే వ్యాక్సిన్ కోసం మరో దేశానికి పయనమవ్వడం. పోయిన సంవత్సరం మన దేశం నుంచి చాలామంది వ్యాక్సినేషన్ కోసం అమెరికా వెళ్లారు. దీని కోసం ప్రత్యేకంగా ప్యాకేజీ ఉంటుది. ఇరు దేశాల టూర్ ఆపరేటర్లు టూర్ కి సంబంధించిన వసతులు దాంతో పాటు వ్యాక్సిన్ కు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. యూఎస్, యూకే దేశాలకు వ్యాక్సిన్ టూర్ వేయాలంటే.. ఒక వ్యక్తికి 1700 యూఎస్ డాలర్ల ఖర్చవుతుంది. ఈ ప్యాకేజీలో భాగంగా కస్టమర్‌కు ‘ఫైజర్ బయోఎన్‌టెక్ టీకా’ అందిస్తారు. అలాగే క్యారంటైన్‌లో ఉండే ఏర్పాట్లు చేస్తారు.

అలాగే ‘స్పుత్నిక్ టీకా’ కోసం రష్యాకు కూడా ప్రత్యేక ‘వ్యాక్సిన్ టూర్’ ప్యాకేజీలు అందిస్తున్నారు పలు టూర్ ఆపరేటర్లు. ఇలా వ్యాక్సిన్ టూరిజం ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. రోజు రోజుకీ వ్యాక్సిన్ టూరిజం పెద్ద బిజినెస్ లా మారుతోంది. కొవిడ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న దేశాలలో వ్యాక్సిన్ కోసం విదేశాల బాట పడుతున్నారు.

Tags:    
Advertisement

Similar News