కోవిడ్ రికవరీ మెనూ ఇదీ..

రోజు రోజుకీ కోవిడ్ బారిన పడుతున్న వాళ్లు పెరుగుతున్నారు. చాలామంది ఇంట్లోనే కూర్చొని కోవిడ్ ను నయం చేసుకుంటున్నారు. అయితే కోవిడ్ కు ఇమ్యూనిటీ ఒక్కటే మందు. శరీరంలో తగినంత ఇమ్యూనిటీ ఉంటే కోవిడ్ దానంతట అదే పోతుంది. అయితే ఈ రెండు వారాల్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి? కోవిడ్ సోకినప్పుడు శరీరాన్ని రెండు రకాలుగా సిద్ధం చేయాలి. ఒకపక్క కోవిడ్ తో వచ్చే నిస్సత్తువ, నీరసాన్ని ఎదుర్కొంటూనే మరోపక్క శరీరం నుంచి […]

Advertisement
Update:2021-05-18 09:25 IST

రోజు రోజుకీ కోవిడ్ బారిన పడుతున్న వాళ్లు పెరుగుతున్నారు. చాలామంది ఇంట్లోనే కూర్చొని కోవిడ్ ను నయం చేసుకుంటున్నారు. అయితే కోవిడ్ కు ఇమ్యూనిటీ ఒక్కటే మందు. శరీరంలో తగినంత ఇమ్యూనిటీ ఉంటే కోవిడ్ దానంతట అదే పోతుంది. అయితే ఈ రెండు వారాల్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి?

కోవిడ్ సోకినప్పుడు శరీరాన్ని రెండు రకాలుగా సిద్ధం చేయాలి. ఒకపక్క కోవిడ్ తో వచ్చే నిస్సత్తువ, నీరసాన్ని ఎదుర్కొంటూనే మరోపక్క శరీరం నుంచి వైరస్ ను తొలిగించే పని కూడా చేయాలి. దీని కోసం ఓ నిర్ధిష్టమైన డైట్ ను ఫాలో అవ్వాలి. అదేంటంటే..

డైట్ ను ఐదు స్టెప్స్ లో ఫాలో అవ్వాలి. నిద్ర లేచిన వెంటనే, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం, రాత్రి భోజనం.. ఈ ఐదు సమయాల్లో ఏవేవి తినాలో ఇప్పుడు చూద్దాం.

నిద్ర లేచిన వెంటనే: ఉదయం నిద్ర లేచిన వెంటనే వేడి నీళ్లలో తేనె, నిమ్మరసం, అల్లం కలుపుకుని తాగాలి. ఇది కోవిడ్ తో గొంతులో వచ్చే సమస్యను తగ్గిస్తుంది. తర్వాత నీళ్లలో నానబెట్టిన పప్పులు తినాలి. బాదం, వేరుశెనగ లాంటివి. వీటిలో ఉండే పోషకాలు అలసటను తగ్గించి రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి.

అల్పాహారం: ఇక అల్పాహారం సమయానికి మిల్లెట్స్ లేదా గోధుమలతో చేసిన రొట్టెలు లాంటివి తింటే మంచిది. వేపుడు పదార్థాలు, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉండేవి కాకుండా ఫైబర్ ఉండేవి తినాలి.

మధ్యాహ్న భోజనం: ఇక లంచ్ సమయంలో కూరగాయలు, ఆకుకూరలతో వండిన కూరలు తింటే మంచిది. రోజుకో గుడ్డు తప్పని సరి.

సాయంత్రం: సాయంత్రం శ్నాక్స్ కింద ఏవైనా ఫ్రూట్స్ తింటే మంచిది. ఈ రెండు వారాల్లో జంక్ ఫుడ్, బయటి పదార్థాలు తినకూడదు. అలాగే స్వీట్స్, ఐస్ క్రీమ్స్ కూడా తగ్గిస్తే మంచిది.

రాత్రి భోజనం: ఇక పడుకోబోయే ముందు కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేలా ఏదైనా తినాలి. కిచిడి లేదా రొట్టెలు లాంటివి. రాత్రి తినే ఆహారం కాస్త తక్కువ మోతాదులో తింటే మంచిది.

ఇవి కూడా..
– జంక్​ ఫుడ్​ను పూర్తిగా మానేయాలి.
– విటమిన్‌‌– సి, జింక్‌‌ ఉండే పదార్థాలు తినాలి.
– నీళ్లు ఎక్కువగా తాగాలి. హైడ్రేషన్‌‌ ఎలాంటి అనారోగ్యం నుంచైనా కోలుకునేలా చేస్తుంది.
– కూల్ డ్రింక్స్ తాగకూడదు. నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు మేలు చేస్తాయి.
– షుగర్​, గుండె సంబంధిత సమస్యలున్న వాళ్లు డాక్టర్ను కలిసి డైట్ లో మార్పులు చేసుకోవచ్చు.
– రోజుకు మూడు పూటలా ఫుడ్ తీసుకున్నట్టే రోజుకి ఒకసారైనా మార్నింగ్​ లేదా ఈవెనింగ్​​ టైంలో ఎక్సర్​ సైజ్ చేయాలి. ఇమ్యూనిటీకి ఫుడ్ ఎంత ముఖ్యమో వ్యాయామమూ అంతే ముఖ్యం.

Tags:    
Advertisement

Similar News