షుగర్ ఉంటే బ్లాక్ ఫంగస్ వస్తుందా?

గత కొంతకాలంగా కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కూడా కలవరపెడుతోంది. కోవిడ్ సోకిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కేవలం వాతావరణం నుంచి మనలోకి ప్రవేశించి కళ్లను, మెదడుని పాడు చేస్తుంది. కోవిడ్ వచ్చినవాళ్లంతా బ్లాక్ ఫంగస్ లేకుండా బయటపడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారికి బ్లాక్ ఫంగస్ రిస్క్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. అసలు విషయమేంటంటే.. వాతావ‌ర‌ణం ద్వారా కూడా సోకగలిగే ఈ ఫంగ‌స్ కు షుగర్ వ్యాధికి కొంత సంబంధం ఉంది. షుగ‌ర్ […]

Advertisement
Update:2021-05-17 10:03 IST

గత కొంతకాలంగా కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కూడా కలవరపెడుతోంది. కోవిడ్ సోకిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇది కేవలం వాతావరణం నుంచి మనలోకి ప్రవేశించి కళ్లను, మెదడుని పాడు చేస్తుంది. కోవిడ్ వచ్చినవాళ్లంతా బ్లాక్ ఫంగస్ లేకుండా బయటపడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారికి బ్లాక్ ఫంగస్ రిస్క్ ఎక్కువగా ఉంటుందంటున్నారు. అసలు విషయమేంటంటే..
వాతావ‌ర‌ణం ద్వారా కూడా సోకగలిగే ఈ ఫంగ‌స్ కు షుగర్ వ్యాధికి కొంత సంబంధం ఉంది. షుగ‌ర్ పేషెంట్స్‌లో బ్లాక్ ఫంగ‌స్ సోకే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని డాక్టర్లు చెప్తున్నారు.

మ్యుకోర్ మైకోసిస్ అనే ఈ బ్లాక్ ఫంగ‌స్‌ మ‌నుషుల‌కు గాలి ద్వారా సోకుతుంది. శ‌రీరంలోకి వెళ్లిన ఫంగ‌స్ ఊపిరితిత్తుల్లో, సైనస్‌ వద్ద చేరుతుంది. కోవిడ్ సోకిన వారిలో ఈ వ్యాధి ఎక్కువ‌గా సోకే అవ‌కాశం ఉంది. వీరితో పాటు.. స్టెరాయిడ్స్ ఉప‌యోగించిన వారిలో.. ఐసీయూలో చికిత్స పొందిన వారికి కూడా ఈ ముప్పు ఎక్కువే.

షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటే అందులోనూ కోవిడ్ సోకినప్పుడు ఆ రెండు వారాల పాటు షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోగలిగితే.. బ్లాక్ ఫంగ‌స్ సోకే అవ‌కాశం తక్కువని నిపుణులు చెప్తున్నారు. క‌రోనా సోకినప్పటి నుంచి క్రమం త‌ప్పకుండా షుగ‌ర్ లెవల్స్ చెక్ చేసుకుంటూ.. షుగ‌ర్‌ను కంట్రోల్ లో ఉంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News