కరోనా కష్టకాలంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు..

కరోనా కష్టకాలంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ తో అనాథలైన పిల్లలకు రూ.10లక్షల ఆర్థిక సాయం అందించేందుకు తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు మరణిస్తే, ఏ ఆదరణ లేకుండా అనాథలుగా మారిన పిల్లలకు ఈ మొత్తం అందేలా చర్యలు తీసుకుంటారు. అయితే నేరుగా రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని చిన్నారులకు ఇవ్వకుండా, వారి పేరుతో బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తారు. ఎఫ్.డి. పై వచ్చే వడ్డీతో పిల్లల అవసరాలు తీర్చేలా […]

Advertisement
Update:2021-05-17 16:41 IST

కరోనా కష్టకాలంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ తో అనాథలైన పిల్లలకు రూ.10లక్షల ఆర్థిక సాయం అందించేందుకు తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు మరణిస్తే, ఏ ఆదరణ లేకుండా అనాథలుగా మారిన పిల్లలకు ఈ మొత్తం అందేలా చర్యలు తీసుకుంటారు. అయితే నేరుగా రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని చిన్నారులకు ఇవ్వకుండా, వారి పేరుతో బ్యాంకుల్లో ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తారు. ఎఫ్.డి. పై వచ్చే వడ్డీతో పిల్లల అవసరాలు తీర్చేలా బంధువులకు సూచించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. దీనిపై పూర్తి కార్యాచరణ సిద్ధం చేసి, ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పారు.

ఏపీలో కరోనా బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. పక్క తెలుగు రాష్ట్రం తెలంగాణలో మాత్రం కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలోకి తీసుకు రాలేదు. దీంతో అక్కడి ప్రతిపక్షాలు ఏపీతో పోలుస్తూ కేసీఆర్ సర్కారుపై ఒత్తిడి పెంచుతున్నాయి. కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తామంటూ ఇటీవల కేటీఆర్ హామీ ఇచ్చినా, ఇంకా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో తెలంగాణలో పేద, మధ్యతరగతి వర్గాలవారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ దొరక్కపోతే, ప్రైవేట్ ఆస్పత్రుల ఫీజుల బాదుడికి బలైపోతున్నారు. ఇక ఇటు ఏపీ ప్రభుత్వం మాత్రం కరోనాతోపాటు బ్లాక్ ఫంగస్ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో అటు తెలంగాణ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరిగింది.

నిరుపేదల వైద్యానికి సాయం చేయడంతోపాటు.. కరోనా రోగులు మరణిస్తే అంత్యక్రియల ఖర్చులకోసం రూ.15వేలు మంజూరు చేస్తూ ఇటీవలే జీవో విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. మొత్తమ్మీద.. కరోనా మహమ్మారితో జరుగుతున్న పోరులో నిరుపేదలు ఆర్థిక కష్టాలపాలు కాకుండా.. ఇటీవల పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం.

Tags:    
Advertisement

Similar News