మహా కుంభమేళాలో యోగి ఆదిత్యనాథ్‌

పుణ్యస్నానం ఆచరించిన యూపీ సీఎం

Advertisement
Update:2025-01-22 16:14 IST

ప్రయాగ్‌రాజ్‌ లో నిర్వహిస్తోన్న మహా కుంభమేళాలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దాస్‌ బుధవారం పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా త్రివేణి సంగమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహా కుంభమేళాకు విచ్చేసిన భక్తులతో కాసేపు ముచ్చటించారు. అక్కడి సౌకర్యాలు, సమస్యల గురించి ఆరా తీశారు. ఆ తర్వాత ప్రయాగ్‌రాజ్‌లోనే ఉత్తరప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతమైన మహా కుంభమేళా జరుగుతుంటే మీరు ఎక్కడున్నారని మంత్రులు ఆశీశ్ పటేల్‌, సంజయ్‌ నిషాద్‌లను సీఎం యోగి ప్రశ్నించినట్టు తెలిసింది. మహా కుంభమేళా ఏర్పాట్లలో తలమునకలై ఉన్న అధికారులకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నావని ఆశీశ్‌ పటేల్‌ ను సీఎం నిలదీసినట్టు తెలిసింది. ఈ మహా క్రతువును ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించేందుకు అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని మంత్రులు, అధికారులకు మరోసారి సీఎం సూచించారు.




 


Tags:    
Advertisement

Similar News