షేమ్ లెస్, యూజ్ లెస్, మైండ్ లెస్.. బాబుపై విజయసాయి సెటైర్లు..

రాష్ట్రంలో కరోనా కష్టాలకు చంద్రబాబే కారణం అంటూ మరోసారి ట్విట్టర్ లో ధ్వజమెత్తారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబుకి సిగ్గులేదు (షేమ్ లెస్) అని ఒకరంటే, ఇంకొకరు పనికిమాలిన వ్యక్తి (యూజ్ లెస్) అంటున్నారని, మరొకరు జాలిలేని మనిషిగా (మెర్సీలెస్) అభివర్ణిస్తున్నారని, చివరకు చంద్రబాబుని అందరూ కలసి పనిలేని వాడు (జాబ్ లెస్) అని తేల్చారని, మతిలేనివాడు (మైండ్ లెస్) అని సర్టిఫికెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు. “రాష్ట్రంలో కొవిడ్ మరణాల పాపం చంద్రబాబుకు తప్పక చుట్టుకుంటుంది. […]

Advertisement
Update:2021-05-16 14:01 IST

రాష్ట్రంలో కరోనా కష్టాలకు చంద్రబాబే కారణం అంటూ మరోసారి ట్విట్టర్ లో ధ్వజమెత్తారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబుకి సిగ్గులేదు (షేమ్ లెస్) అని ఒకరంటే, ఇంకొకరు పనికిమాలిన వ్యక్తి (యూజ్ లెస్) అంటున్నారని, మరొకరు జాలిలేని మనిషిగా (మెర్సీలెస్) అభివర్ణిస్తున్నారని, చివరకు చంద్రబాబుని అందరూ కలసి పనిలేని వాడు (జాబ్ లెస్) అని తేల్చారని, మతిలేనివాడు (మైండ్ లెస్) అని సర్టిఫికెట్ ఇచ్చారని ఎద్దేవా చేశారు.

“రాష్ట్రంలో కొవిడ్ మరణాల పాపం చంద్రబాబుకు తప్పక చుట్టుకుంటుంది. ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ నిధులన్నీ కార్పోరేట్ ఆస్పత్రులకు మళ్లించాడు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాడు. ఇక్కడ మౌలిక వసతుల కొరత వల్లే రోగులు పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.” అంటూ ట్విట్టర్ లో విమర్శించారు విజయసాయిరెడ్డి.

“సొంత పార్టీ ఎంపీలు నలుగురిని స్వయంగా తనే బీజేపీలోకి పంపించాడు. దానిపై ఒక్క మాట మాట్లాడలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీని లోబర్చుకుని తల్లిలాంటి పార్టీపై ఆరోపణలు చేయించాడు. ప్రభుత్వంపై కేసులు వేయించాడు. దీన్ని రాజకీయం అంటారా బ్రోకరిజం అంటారా చంద్రబాబూ?” అని ప్రశ్నించారు.

నారా లోకేష్ ని చూస్తే జాలేస్తుందంటూ సెటైర్లు పేల్చారు విజయసాయిరెడ్డి. “పప్పూ… నిన్ను చూస్తే జాలేస్తోంది! మీ నాన్న దత్తపుత్రుడిని నమ్మాడు, గరుడ పురాణాన్ని నమ్మాడు, చెప్పుల పార్టీని నమ్మాడు, చివరికి దిష్టి రాజు దిబ్బ రాజును కూడా నమ్మాడు, నిన్ను మాత్రం నమ్మలేదు! అయినా, పప్పూ… నువ్వు మాత్రం మీ నాన్ననే నమ్ము.” అంటూ దెప్పిపొడిచారు.

Tags:    
Advertisement

Similar News