వేర్వేరు టీకాలు తీసుకోవచ్చా?
దేశవ్యాప్తంగా ఇప్పుడు టీకా కొరత ఎక్కువగా ఉండడంతో.. మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు తీసుకోవడం కష్టంగా మారింది. అందుకే దీనికి పరిష్కారంగా రెండు డోసులు రెండు వేరువేరు టీకాలు వాడవచ్చా అనే టాపిక్ తెరపైకి వచ్చింది. మొదటి డోసు ఒక రకం టీకా.. రెండో డోసు మరో రకం టీకా ఇలా మిక్స్‌డ్ డోసులు తీసుకుంటే ఏమవుతుంది అనే విషయం మీద కొన్ని పరిశోధనలు జరిగాయి. అందులో ఏం తేలిందంటే.. మిక్స్‌డ్ డోసులతో ఏమవుతుంది? అనే […]
దేశవ్యాప్తంగా ఇప్పుడు టీకా కొరత ఎక్కువగా ఉండడంతో.. మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు తీసుకోవడం కష్టంగా మారింది. అందుకే దీనికి పరిష్కారంగా రెండు డోసులు రెండు వేరువేరు టీకాలు వాడవచ్చా అనే టాపిక్ తెరపైకి వచ్చింది. మొదటి డోసు ఒక రకం టీకా.. రెండో డోసు మరో రకం టీకా ఇలా మిక్స్‌డ్ డోసులు తీసుకుంటే ఏమవుతుంది అనే విషయం మీద కొన్ని పరిశోధనలు జరిగాయి. అందులో ఏం తేలిందంటే..
మిక్స్‌డ్ డోసులతో ఏమవుతుంది? అనే అంశంపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ సైంటిస్టులు ప్రయోగాలు చేసి చూశారు. 830 మంది వాలంటీర్లకు 28 రోజుల వ్యవధిలో వేర్వేరు డోసులు ఇచ్చి ప్రయోగాలు చేశారు. ఆస్ట్రాజెనెకా, ఫైజర్ టీకాల కాంబినేషన్ తో మొదలు పెట్టి ప్రస్తుతం అందుబాటులో ఉన్న రకరకాల వ్యాక్సిన్ ల కాంబినేషన్లను కూడా టెస్ట్ చేసి చూశారు. వాటి రిజల్ట్స్ ను బట్టి ఇలా మిక్స్‌డ్ డోసుల వల్ల ప్రయోజనం కన్నా దుష్ప్రభావాలే ఎక్కువగానే ఉన్నట్లు తేల్చారు. రెండు వేర్వేరు టీకా డోసులు తీసుకోవడం వల్ల తీవ్ర ప్రమాదం లేనప్పటికీ.. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నందున రెండు వేర్వేరు వ్యాక్సిన్ డోసులను తీసుకోకపోవడమే బెటర్ అని నిపుణులు స్పష్టం చేశారు. నార్మల్ గా టీకా తీసుకున్నప్పుడు తలనొప్పి, అలసట, జ్వరం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తుంటాయి. అయితే ఇలా మిక్సింగ్ డోసులు తీసుకున్నవారిలో అవి మరింత ఎక్కువైనట్టు పరిశోధనలో తేలింది.
అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ వేర్వేరు వ్యాక్సిన్లను తీసుకోవద్దని జాతీయ, అంతర్జాతీయ నిపుణులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వారు కచ్చితంగా అదే రకం టీకాను రెండో డోసుగా తీసుకోవాలని స్పష్టం చేశారు.