రఘురామ అరెస్ట్.. విజయవాడకు తరలింపు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. రఘురామ కృష్ణం రాజు వైసీపీ తరఫున గెలిచినప్పటికీ .. ఆయన చాలా రోజులుగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఢిల్లీలో రచ్చబండ పేరుతో ఆయన సీఎం జగన్ మోహన్‌రెడ్డి.. వైసీసీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటారు. మరోవైపు ఇటీవల కొన్ని మీడియా చానల్స్‌లో రఘురామ కృష్ణం రాజు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు ఆయన మీద సోషల్‌మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఇక […]
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. రఘురామ కృష్ణం రాజు వైసీపీ తరఫున గెలిచినప్పటికీ .. ఆయన చాలా రోజులుగా ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఢిల్లీలో రచ్చబండ పేరుతో ఆయన సీఎం జగన్ మోహన్‌రెడ్డి.. వైసీసీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటారు.
మరోవైపు ఇటీవల కొన్ని మీడియా చానల్స్‌లో రఘురామ కృష్ణం రాజు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరోవైపు ఆయన మీద సోషల్‌మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఇక టీడీపీ, జనసేన రఘురామకు అనుకూలంగా పోస్టులు పెడుతుంటారు. ఇదిలా ఉంటే తాజాగా వివాదాస్పద నటి శ్రీరెడ్డి సైతం రఘురామ కృష్ణం రాజుకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇదిలా ఉంటే ఇవాళ హైదరాబాద్‌లో రఘురామ కృష్ణం రాజును ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై 124 ఏ, 153 ఏ, 505 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడారని సీఐడీ ఆయన మీద అభియోగం మోపింది. ఆయన భార్య రమాదేవి పేరిట నోటీసులు జారీచేశారు. పోలీసులు ఆయనను విజయవాడకు తరలించారు.
ఈ ఘటనపై రఘురామ కృష్ణం రాజు కుమారుడు భరత్ మాట్లాడుతూ.. ’పుట్టినరోజునాడే మా నాన్నను అరెస్ట్ చేశారు. ఆయనకు మూడు నెలల క్రితం గుండె శస్త్ర చికిత్స జరిగింది. ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారో అర్థం కావడం లేదు. వై కేటగిరీ భద్రత ఉన్న ఎంపీని బలవంతంగా తీసుకెళ్లడం న్యాయమేనా’ అని ఆయన ప్రశ్నించారు. రఘురామ అరెస్ట్ వ్యవహారం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.