ఏపీలో వ్యాక్సినేషన్​ బంద్​

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్​డౌన్​ విధించాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నది. అయినప్పటికీ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్​లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్​ ప్రక్రియను ముమ్మరం చేసింది. అయితే వ్యాక్సిన్​ డోసులు అందుబాటులో లేవని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. మరోవైపు ప్రతిరోజు వ్యాక్సినేషన్​ కేంద్రాలకు ప్రజలకు భారీగా […]

Advertisement
Update:2021-05-10 09:14 IST

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్​డౌన్​ విధించాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్​ కొనసాగుతున్నది. అయినప్పటికీ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్​లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్​ ప్రక్రియను ముమ్మరం చేసింది. అయితే వ్యాక్సిన్​ డోసులు అందుబాటులో లేవని రాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. మరోవైపు ప్రతిరోజు వ్యాక్సినేషన్​ కేంద్రాలకు ప్రజలకు భారీగా తరలివస్తున్నారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాలు భారీగా గుమిగూడటం వల్ల కరోనా మరింత వ్యాపించే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఏపీకి సరిపడా వ్యాక్సిన్​ డోసులు పంపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్​ డోసులకు డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాక్సిన్​ విధానం వల్ల.. రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్​ అందడం లేదని మంత్రులు అంటున్నారు.

మరోవైపు కరోనా కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్​ వేయించుకొనేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. పలు కేంద్రాలకు ఇంకా వ్యాక్సిన్​ డోసులు అవసరం. ఈ పరిస్థితుల్లో ఓ రెండ్రోజులపాటు వ్యాక్సిన్​ పంపిణీని నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.

వ్యాక్సిన్​ కేంద్రాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాకుండా.. ఓ పక్కా విధానం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇందులో భాగంగా ముందుగానే ఆశ వర్కర్లు, ఏఎన్​ఎంలకు వ్యాక్సిన్​ పంపిణీ పై అవగాహన కల్పించనున్నారు. ప్రస్తుతం చాలా మందికి మొదటి డోసు తీసుకొని రెండో డోసు కోసం వేచి చూస్తున్నారు. వీరికి వ్యాక్సిన్​ ఇవ్వాల్సి ఉంది.

ఇదిలా ఉంటే ప్రజలు నేరుగా వ్యాక్సిన్​ తీసుకొనే అవకాశం లేదు. కచ్చితంగా కోవిన్​ యాప్​లో రిజిస్టర్​ చేసుకోవాలి. దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరెవరు ఇప్పటికే వ్యాక్సిన్​ తీసుకున్నారు? అన్న విషయంపై ప్రభుత్వం ఆరా తీస్తున్నది. ముందుగా ఎవరికి వ్యాక్సిన్​ ఇవ్వబోతున్నారు. వ్యాక్సిన్​ డోసు ఇవ్వవలసిన వారికి ఏ సమయంలో ఏ టైంలో రావాలో ముందుగానే సమాచారం ఇవ్వబోతున్నారు.

ఇలా చేస్తే వ్యాక్సిన్​ కేంద్రాల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసమే ఇవాళ రేపు వ్యాక్సినేషన్​ ప్రక్రియను నిలిపివేశారు.

Tags:    
Advertisement

Similar News